ప్రపంచంలో ఖరీదైన పదార్థం ఇదే! అంబానీ, అదానీల ఆస్తి మొత్తం కలిపినా ఒక్క గ్రాము కూడా రాదు

సాధారణంగా మనకు తెలిసిన అత్యంత ఖరీదైన వస్తువులు అంటే బంగారం, వెండి లేదా వజ్రాలు. వీటిని కొనేందుకు మనం లక్షల్లో, కోట్లలో ఖర్చు చేస్తాం. కానీ, ఈ ప్రపంచంలో ఒక పదార్థం ఉంది, దాని ముందు వజ్రాలు కూడా చాలా చౌకగా కనిపిస్తాయి.


అదే ‘యాంటీమ్యాటర్’ (Antimatter).

దీని ధర ఎంత ఉంటుందో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఒక అంచనా ప్రకారం.. ఒక గ్రాము యాంటీమ్యాటర్ ధర సుమారు 62.5 ట్రిలియన్ డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 51 లక్షల కోట్ల పైమాటే! మన దేశంలోని అత్యంత ధనవంతులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల మొత్తం సంపదను కలిపినా ఇందులో ఒక గ్రాము కూడా కొనలేరు అంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఏమిటీ యాంటీమ్యాటర్? ఎందుకు ఇంత ధర?

మనం చూసే వస్తువులన్నీ మ్యాటర్ (Matter) తో తయారవుతాయి. కానీ, యాంటీమాటర్ అనేది దానికి రివర్స్. అంటే అద్దంలో మన ప్రతిబింబం ఎలా ఉంటుందో, సాధారణ పదార్థానికి యాంటీమ్యాటర్ ఒక ప్రతిబింబం లాంటిది. ఇందులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ, వాటి ఛార్జ్ మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది.

ఇది ఎందుకు ఇంత ఖరీదైనది అంటే.. దీనిని తయారు చేయడం అత్యంత కష్టం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విలువైన పదార్థం. ఒకవేళ పొరపాటున ఈ యాంటీమ్యాటర్ సాధారణ పదార్థంతో కలిస్తే, అది పెను విస్ఫోటనాన్ని సృష్టిస్తుంది. ఆ శక్తి అణు బాంబు కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది.

CERN సృష్టించిన అద్భుతమైన కంటైనర్

యాంటీమాటర్ తయారీ ఎంత కష్టమో.. దానిని భద్రపరచడం కూడా అంతే కష్టం. గాలి తగిలినా ఇది పేలిపోతుంది. అందుకే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN) శాస్త్రవేత్తలు చరిత్రలో మొదటిసారిగా దీనిని రవాణా చేయడానికి ఒక ప్రత్యేకమైన కంటైనర్‌ను తయారు చేశారు.

కేవలం రెండు మీటర్ల పొడవు ఉన్న ఈ కంటైనర్ ద్వారా యాంటీమాటర్‌ను ఒక చోటు నుండి మరో చోటుకు సురక్షితంగా తరలించవచ్చు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో శాస్త్రవేత్తలు దీనిని 4 కిలోమీటర్ల దూరం విజయవంతంగా తీసుకెళ్లారు. త్వరలోనే జెనీవాలోని ల్యాబ్ నుండి జర్మనీలోని ఒక యూనివర్సిటీకి (800 కిమీ దూరం) దీనిని తరలించనున్నారు.

భవిష్యత్తు దీనిదే!

బంగారం, వజ్రాలు కేవలం హోదా కోసం వాడతాం. కానీ, యాంటీమాటర్ వల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

  • అంతరిక్ష ప్రయాణం: యాంటీమాటర్ ఇంధనంగా వాడితే కొన్ని నెలలపాటు పట్టే అంతరిక్ష ప్రయాణాన్ని కొన్ని రోజుల్లోనే పూర్తి చేయవచ్చు.
  • శక్తి వనరు: దీనిపై ప్రయోగాలు చేసి.. దీన్ని అత్యంత శక్తివంతమైన స్వచ్ఛమైన ఇంధనంగా మార్చే వీలుంది.
  • విశ్వం పుట్టుక: అసలు ఈ విశ్వం ఎలా పుట్టిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఇది ఒక తాళంచెవిలా ఉపయోగపడుతుంది.

ప్రస్తుతానికి ఇది కేవలం ల్యాబ్‌లకే పరిమితమైనా భవిష్యత్తులో ఎనర్జీ, స్పేస్ ట్రావెల్ వంటి రంగాల్లో ఈ యాంటి మ్యాటర్ (Antimatter) సృష్టించబోయే సంచలనం అంతా ఇంతా కాదు!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.