ఈ ఫోన్ మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది.. 16000mAH బ్యాటరీ – ఫీచర్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘ఔకిటెల్’ మరో బిగ్గెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Oukitel WP300 పేరుతో కిర్రాక్ మొబైల్‌ను ప్రపంచ మార్కెట్‌లో రిలీజ్ చేసింది.


ఈ కంపెనీ ముఖ్యంగా రగ్గడ్ లుక్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కూడా అలాంటి మొబైల్‌నే తీసుకొచ్చింది. Oukitel WP300 ఫోన్ కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదని కంపెనీ చెబుతోంది. దీనిని ‘ప్రపంచంలోని మొట్టమొదటి పారిశ్రామిక-గ్రేడ్ మాడ్యులర్ స్మార్ట్ రగ్డ్ ఫోన్’ అని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైనది దాని బ్యాటరీ. ఇది దాదాపు 16000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Oukitel WP300

ప్రపంచ మార్కెట్లో Oukitel WP300 మొబైల్ అసలు ధర రూ.51,252గా నిర్ణయించబడింది. దీనిపై భారీ ఆఫర్ ఉంది. ఆ ఆఫర్‌తో ఇప్పుడు దీనిని కేవలం రూ. 34,000కే కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక గ్లోబల్ వెబ్‌సైట్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు. Oukitel WP300 కిక్‌స్టార్టర్ పేజీ ఈ నెలాఖరుకి అందుబాటులోకి వస్తుంది.

Oukitel WP300 అనేది ఆల్-ఇన్-వన్ పరికరంగా రూపొందించబడింది. ఈ ఫోన్ IP69, IP69K, MIL-STD-810H సర్టిఫికేషన్‌తో వస్తుంది. అంటే ఇది వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్, షాక్‌ప్రూఫ్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌కు శక్తినివ్వడానికి 16000mAh బ్యాటరీని అందించారు. ఈ మొబైల్‌తో ఇతర పరికరాలను ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Ouiktel ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 650 nits బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 12GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. వర్చువల్ RAM ద్వారా దీనిని 36GB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. వెనుక భాగంలో 108MP AI కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీనికి నానో + నానో సిమ్ సెటప్ ఉంది. కనెక్టివిటీలలో వైఫై 6, బ్లూటూత్ 5.2, NFC, గ్లోనాస్, GPS వంటివి ఉన్నాయి.

ఫోన్‌తో పాటు మరిన్ని ఫీచర్లు అందించారు. ఫోన్‌కు వెనుక వైపు LED క్యాంపింగ్ లైట్‌ను అందించారు. దీనిని అవసరం అయినపుడు పెట్టొచ్చు, తీయ్యొచ్చు. అలాగే దాని ప్లేస్‌లో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ను అందించారు. అవసరమైనప్పుడు కాంపాక్ట్ స్మార్ట్‌వాచ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.