కూటమి నుంచి భయటకు జన సేనాని..? షాక్ లో టీడీపీ, బీజేపీ.. కారణం ఇదే

www.mannamweb.com


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు, వారి చర్యల పట్ల పవన్ కళ్యాణ్ ఎలాంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఏపీ హోం మంత్రిపై తీవ్రంగా విమర్శలు చేసిన పవన్, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై బియ్యం అక్రమ రవాణా అంశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజలకు చెందిన వనరులు లేదా పథకాలను అన్యాయంగా ఆక్రమించాలని ఎవరైనా చూస్తే, ఎంతటి వ్యక్తులైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం,” అని హెచ్చరించడం ద్వారా తన ఆగ్రహాన్ని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ కూటమితో కలిసి గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలను జనసేన గెలుచుకుంది. కానీ ఇటీవల టీడీపీ నాయకులపై ఆయన ఎక్కువగా విమర్శలు చేయడం వల్ల రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. పవన్ కూటమి నుంచి బయటకు వస్తారా? టీడీపీపై టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనే అంశాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వీడియోలు జనసేన అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

“పవన్ ప్రజల కోసం పనిచేయాలని చూస్తుంటే, టీడీపీ నాయకులు సహకరించడం లేదు” అంటూ పవన్ అభిమానులు టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీకి చెందిన కొన్ని వర్గాలు, పవన్ కూటమి నుంచి బయటకు రావాలని కూడా సూచిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తేల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.