ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 25న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.
ఈ పరీక్షలు ఒకే రోజు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగగా, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 1 నుంచి 4 వరకు జరుగుతాయి. ఇవి కూడా రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్షలు జరుగుతాయి. ఇక, జూన్ 6వ తేదీన నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్ 7వ తేదీన పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్…
వచ్చే నెల 24వ తేదీన ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-1, 2 ఉంటుంది. మే 25వ తేదీన ఇంగ్లిష్ పేపర్-1, 2 పరీక్ష నిర్వహిస్తారు. మే 27న మ్యాథమెటిక్స్ పేపర్-1ఏ, 2ఏ, బయాలజీ పేపర్-1, 2, సివిక్స్ పేపర్-1, 2 పరీక్షలు జరుగుతాయి. మే 28వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్-1బీ, 2బీ, జువాలజీ పేపర్-1, 2 ఉంటుంది. మే 29వ తేదీన హిస్టరీ పేపర్-1, 2, ఫిజిక్స్ పేపర్-1, 2, ఎకనామిక్స్ పేపర్-1, 2 జరుగుతుంది.
మే 30వ తేదీన కెమిస్ట్రీ పేపర్-1, 2, కామర్స్ పేపర్-1, 2, సోషియాలజీ పేపర్-1, 2, ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1, 2 మే 31వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, 2, లాజిక్ పేపర్-1, 2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్-1, 2 జూన్ 1వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, 2, జాగ్రఫీ పేపర్-1, 2 పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలను కూడా బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 18 నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24 వరకు అవకాశం కల్పించగా, ఫీజు చెల్లింపు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.