ఈ లడ్డూ పరమ పవిత్రం! ఈ లడ్డూ దొరకడం మహా భాగ్యం! లడ్డూ మాధుర్యం 300 ఏళ్ల నాటిది..!

www.mannamweb.com


తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేదీ.. ఈ లడ్డూనే! ఎవరు తిరుపతికి వెళ్లినా.. ప్రసాదం ఎక్కడ అని ఆత్రంగా వెతికేదీ ఈ లడ్డూ కోసమే! ఎవరు తిరుమలకు వెళ్లొచ్చినా..

ఇంటికి వచ్చి..దీపారాధన చేసి..నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే! అమెరికాలో ఉన్నా..ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఈ లడ్డూ కోసమే! ఎప్పుడు తెలుగు గడ్డకు వచ్చినా.. తిరుమలకు గబగబా మెట్లెక్కి శ్రీవారిని దర్శించి..ఆ స్వామి వర ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేది ఈ లడ్డూనే!

విశ్వరూపధారి అయిన తిరుమల గోవిందుడు.. మన ఇంటికి వచ్చేది ఈ లడ్డూ రూపంలోనే! ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు.. కోట్లాది భక్తుల ఎమోషన్‌! ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.