ఏసీ ఉపయోగించిన కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వాల్సిందే..!

www.mannamweb.com


మార్చి నెల స్టార్టింగ్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వచ్చేవారు కాదు ఇంట్లో ఉండే వాళ్లు కూడా ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. సూర్యుడు వేడి తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతారు.
మార్చి నెల స్టార్టింగ్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వచ్చేవారు కాదు ఇంట్లో ఉండే వాళ్లు కూడా ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. సూర్యుడు వేడి తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతారు.
ఇక సమ్మర్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఫ్యాన్లతో ఈ వేడిని తట్టుకోవడం కష్టం అవుతోంది. దీంతో చాలా మంది కూలర్లు, ఏసీలు తీసుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్‌లో మాక్సిమమ్ చాలా మంది ఏసీలు ఉపయోగిస్తుంటారు. అయితే.. కొంత మంది మాత్రం కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చేస్తుందంటూ లబో దిబో మని ఏడుస్తారు. మరి ఏసీ ఉపయోగించిన తక్కువ కరెంట్ బిల్లు రావాలంటే ఈ సింపుల్ ట్రిక్ పాటించాల్సి ఉంటోంది. అవేంటో తెలుసుకుందాం..

సాధారణంగా ఏసీకి రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఇక చాలా మంది కూర్చుని లేవడానికి బద్ధంకంగా అనిపించో, లేక మళ్లి ఎలాగో ఆన్ చెయ్యాలి కదా అనుకుంటారో తెలియదు కానీ ఏసీని రిమోట్‌లో మాత్రమే ఆఫ్ చేస్తారు. లేదంటే టైం సెట్ చేసుకుని అలాగే పడుకుంటారు. ఇక రిమోట్ ఆఫ్ చేసేశాం కదా ఆఫ్ అయింది అనుకుంటే అది మన పొరపాటే. ఇలా ఏసీ మెయిన్ స్విచ్చ్ అంటే.. స్టుబిలైజర్‌కి ఫిట్ చేసిన మెయిన్ బటన్ ఆఫ్ చెయ్యకుండా ఉండటం వల్ల కూడా కరెంట్ ఎక్కువ రావడానికి ఒక కారణం. కాబట్టి.. ఏదో తప్పని సరి పరిస్థితుల్లో తప్ప.. రిమోట్ కంట్రోల్‌లో మాత్రమే కాకుండా, స్టెబిలైజర్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేయండి. దీంతో సులభంగా విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది.