జియోటెలీతో థామ్సన్‌ క్యూలెడ్‌ టీవీ ధర రూ.18,999

ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ థామ్సన్‌..దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా జియోటెలీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే 43 అంగుళాల క్యూలెడ్‌ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.18,999 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీ లభించనున్నదని పేర్కొంది.


జియోటెలీ ఓఎస్‌ ఆధారిత టీవీలను విడుదల చేయడానికి జియోతో వ్యూవహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ థామ్సన్‌ క్యూలెడ్‌ టీవీతోపాటు జియోహాట్‌స్టార్‌ను మూడు నెలలపాటు, జియోసావన్‌ మూడు నెలలు, జియోగేమ్స్‌ నెలపాటు ఉచితంగా అందిస్తున్నది. అలాగే రూ.499 విలువైన స్విగ్గీ ఫుడ్‌ ఆర్డర్‌పై రూ.150 తగ్గింపు కల్పిస్తున్నది.