Whatsapp: వాట్సాప్‌లో మూడు కొత్త ఫీచర్లు.. వీటి ఉపయోగాలు ఏంటంటే

ఇక యూజర్ల భద్రతతో పాటు యాప్ యూజర్ ఇంటర్‌ఫేజ్‌కు ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్‌లో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్‌ మరో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా ఆడియోతో పాటు స్క్రీన్‌ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్‌ స్పాట్‌లైట్‌ అనే మూడు కొత్త ఫీచర్లను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్లు ఏంటి.?


ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. మార్కెట్లో ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా.. వాట్సాప్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గకపోవడానికి ఇదే కారణంగా చెప్పొచ్చు.

ఇక యూజర్ల భద్రతతో పాటు యాప్ యూజర్ ఇంటర్‌ఫేజ్‌కు ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్‌లో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్‌ మరో మూడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ముఖ్యంగా ఆడియోతో పాటు స్క్రీన్‌ షేరింగ్, పార్టిసిపెంట్ కెపాసిటీ, స్పీకర్‌ స్పాట్‌లైట్‌ అనే మూడు కొత్త ఫీచర్లను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్లు ఏంటి.? వీటితో కలిగే ప్రయోజనం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆడియోతో స్క్రీన్‌ షేరింగ్‌..
వాట్సాప్‌లో గతకొన్ని రోజుల క్రితం స్క్రీన్‌ షేరింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు తమ స్క్రీన్‌తో పాటు ఆడియోను కూడా ఏకకాలంలో అవతలి వ్యక్తితో షేర్‌చేసుకునే అవకాశం లభిస్తుంది.

వీడియో కాల్‌లో కొత్త ఫీచర్‌..
గ్రూప్‌ వీడియో కాల్స్‌ అనగానే మనకు సహజంగా గూగుల్‌ మీట్‌ లేదా జూమ్‌ వంటి యాప్స్ గుర్తొచ్చేవి కానీ వాట్సాప్‌లో సైతం గ్రూప్‌ వీడియో కాల్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్‌ గ్రూప్‌ కాల్‌లో పార్టిసిపెంట్‌ కెపాసిటీని పెంచింది. దీంతో ఒకేసారి ఏకంగా 32 మంది యూజర్లు వీడియో కాల్‌లో పాల్గొని మాట్లాడుకోవచ్చు.

స్పీకర్ స్పాట్‌లైట్ ఫీచర్..
వాట్సాప్‌ కాల్‌లో ఎవరు మాట్లాడుతున్నారో హైల్‌ చేసేందుకు గాను వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ సహాయంతో మాట్లాడే వ్యక్తిని ఆటోమేటిక్‌గా హైలైట్ చేయడానికి స్పాట్లైట్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. మొన్నటి వరకు సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ వచ్చిన వాట్సాప్‌ తాజాగా ఆడియో, వీడియో క్వాలిటీని మెరుగుపరిచే క్రమంలో ఈ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.