నిద్రిస్తున్న సమయంలో యూట్యూబ్‌లో పాటలు వినడం లేదా ఇతర కంటెంట్‌ను వీక్షించే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. అయితే ఉన్నపలంగా నిద్రలోకి జారుకోవడంతో రాత్రంతా యూట్యూబ్ ప్లే అవుతూనే ఉంటుంది.
దీంతో ఛార్జింగ్ సమస్య ఏర్పడుతుంది. దీనికి చెక్ పెట్టేందుకే యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.
స్లీప్ టైమర్ పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్ ఏదైన వీడియో చూస్తున్నప్పుడు టైమర్ సెట్ చేసుకోవచ్చు. మనం సెట్ చేసుకున్నటైమ్ తరువాత వీడియో ఆటోమెటిక్ గా ఆగిపోతుంది. ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే. ముందుగా.. వీడియో ప్లే అవుతోన్న సమయంలో స్క్రీన్‌పై కనిపించే సెట్టింగ్స్ ఐకాన్‌ను ట్యాప్ చేయాలి. ఆ తర్వాత స్లీప్ టైమర్ ఆప్షన్‌ను ఎంచుకొని కావాల్సిన టైమ సెట్ చేసుకోవచ్చు. మొదట్లో ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.
యూట్యూబ్ తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర మినీ ప్లేయర్‌ను నచ్చిన చోటుకి మార్చుకోవడం. ప్రస్తుతం మినీ ప్లేయర్ కుడివైపు భాగంలో కనిపిస్తుంది. అయితే ఈ కొత్త ఫీచర్ సాయంతో మీకు నచ్చిన ప్లేసులోకి మార్చుకోవచ్చు. సైజ్‌ను పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం కూడా కల్పించారు.
సాధారణంగా యూట్యూబ్‌లో ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్లే లిస్ట్‌ను క్యూ ఆర్ కోడ్ సహాయంతో నచ్చిన వ్యక్తులకు పంపించుకునే అవకాశాన్ని తీసుకొచ్చారు. ఈ ప్లేలిస్ట్‌కు నచ్చిన థంబ్‌నెయిల్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.