పైసా ఖర్చు లేకుండానే థైరాయిడ్ సమస్యకు పరిష్కారం.. ఈ ఒక్క టిప్ పాటిస్తే చాలు

www.mannamweb.com


మెడ భాగంలో బటర్ ఫ్లై ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి (Thyroid Gland) అనేక శారీరక విధులకు కీలకంగా పనిచేస్తుంది. మెటబాలిజంను ఇంప్రూవ్ చేయడంలో, ఎనర్జీ లెవెల్స్‌ కంట్రోల్ చేయడంతో పాటు మిగతా శరీర అవయవాల పనితీరులో కీ రోల్ పోషిస్తుంది.
అందుకే, ఈ థైరాయిడ్ గ్రంథికి ఏమైనా అయితే, ఓవరాల్ హెల్త్‌పై ఎఫెక్ట్ పడుతుంది. థైరాయిడ్ హార్మోన్‌ని రిలీజ్ చేసే ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం సమస్యకు దారితీస్తుంది. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ల విడుదల మితిమీరి అయితే దానిని హైపర్ థైరాయిడిజంగా పరిగణిస్తారు.

చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా థైరాయిడ్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వివిధ రకాల మెడిసిన్స్ వాడితే, సమస్య తగ్గుతుంది. కానీ ఎలాంటి మెడిసిన్ ఖర్చు లేకుండా థైరాయిడ్ సమస్యలకు చెక్ పెట్టే అద్భుత సొల్యూషన్ ఒకటి ఉంది. అదే కొత్తిమీర.. రోజూ కొత్తిమీర తింటే థైరాయిడ్ సమస్య ఉండనే ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వంటల్లో గార్నిష్ చేయడానికి కొత్తిమీర ఎక్కువగా వాడుతుంటాం. ఇది వంటలకు స్పెషల్ ఫ్లేవర్‌ అందించడంతో పాటు హెల్త్‌కి బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో కీలకమైన విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్‌ బ్యాలెన్స్ చేయడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. అందుకే, థైరాయిడ్ సమస్యకు కొత్తిమీర పవర్‌ఫుల్ రెమెడీగా పనిచేస్తుంది. కొత్తిమీరను వివిధ రకాలుగా డైట్‌లో చేర్చుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసే వంటల్లో యాడ్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే కూరల్లో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కొత్తిమీర ప్రభావాన్ని కాస్త తగ్గించే అవకాశం లేకపోలేదు. అందుకే, కొత్తిమీర బెనిఫిట్స్ నేరుగా పొందేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.

కొత్తిమీర పేస్ట్‌తో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ముందుగా కొత్తిమీర ఆకులను చిన్నగా తరుముకోవాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ప్రతిరోజు ఈ డ్రింక్ ఓ గ్లాసు తాగితే థైరాయిడ్ ఆరోగ్యం బాగుంటుంది. ఇక వినడానికి కాస్త వింతగా అనిపించినా కొత్తిమీరతో ఛాయ్‌ చేసుకుంటే థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర ఆకులను నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి తాగవచ్చు.

కొత్తిమీర ఆకులకు బదులు వాటి విత్తనాలు, అంటే ధన్యాలు తిన్నా కూడా అవే బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రతిరోజు ధన్యాల పొడిని ఆహారాల్లో యాడ్ చేసుకుంటే థైరాయిడ్ లెవెల్స్ మేనేజ్ అవుతాయి. ఓ నెల రోజుల పాటు ఇలా చేస్తే మరిన్ని ప్రయోజనాలు అందుతాయి. ఎలాంటి మెడికల్ ఖర్చు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సింపుల్‌గా థైరాయిడ్ సమస్యకు చెక్ చెప్పే సొల్యూషన్ ఇదని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. వ్యక్తిగత సలహా కాదు. దీనిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోండి.)