ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో పులి: ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో

www.mannamweb.com


ఢిల్లీ: కాలుష్యం ప్రస్తుత ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతుంది. నగరాలే కాదు అడవుల్లో కూడ కాలుష్యం వన్యప్రాణులకు ఇబ్బందులు చిక్కులు తెస్తుంది.
అడవుల్లో కూడ ప్లాస్టిక్ వస్తువులు చేరుతున్నాయి.ప్లాస్టిక్ అడవి జంతువులకు హాని కల్గిస్తున్నాయి. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అడవులు అంతరించిపోయి కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దరిమిలా వాతావరణంలో అసాధారణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఉష్ణోగ్రతలు కూడ పెరిగిపోతున్నాయి.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కతికర్ తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్ లో తీసిన వీడియో వైరల్ గా మారింది. 2023 డిసెంబర్ లో తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఓ పులి వాటర్ హోల్ నుండి ప్లాస్టిక్ బాటిల్ ను నోటకర్చుకొని వెళ్లడం చర్చకు దారి తీసింది.నీటిలోని ప్లాస్టిక్ బాటిల్ను తీసుకొని నోటిలోకి తీసుకెళ్లడంతో వీడియో ప్రారంభమౌతుంది. అడవుల్లో కూడ ప్లాస్టిక్ కన్పించడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద స్పందించారు. అడవుల్లో ప్లాస్టిక్ ను దూరంగా ఉంచాలని ఆయన కోరారు. అడవుల్లో నాగరికత చెత్తను శుభ్రం చేయాలన్నారు. ప్లాస్టిక్ చెత్తను అడవుల వద్దకు తీసుకెళ్లడం మానుకోవాలని ఆయన కోరారు.
మానవాళికి కాలుష్యం నుండి అతి పెద్ద ఇబ్బంది. సౌకర్యం కోసం ఉపయోగించే ప్లాస్టిక్ కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. అడవులను కూడ ప్లాస్టిక్ వదలడం లేదు. ప్లాస్టిక్ తో వన్యప్రాణులు కూడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.