Time to worship God: హిందువులు దేవుళ్లను భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రతి రోజు ఇంట్లో దేవుడికి ఉదయం, సాయంత్రం వేళ పూజలు చేస్తూ తమ కోర్కెలు తీర్చాలని ప్రార్థిస్తుంటారు.
అయితే కొంద మంది ప్రతి రోజు రెండు పూటలు పూజలు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రం పూజలు చేస్తుంటారు. అయితే దేవుడికి ఒకే పూట పూజ చేసినా కూడా కరునిస్తాడట. కానీ అది ఏ వేళలో పూజించాలి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. మరి ఏ సమయంలో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుడిని ఉదయం వేళ పూజించడం కంటే సాయంత్రం వేళ పూజించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. దేవుడి అనుగ్రహం దక్కాలనుకునే వారు సాయంత్రం వేళ పూజలు చేస్తే దేవుడి అనుగ్రహం దక్కుతుందని పండితులు అంటున్నారు. అయితే దేవుడిని పూజా సమయంలో చేసే దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది. కానీ దీపారాధాన చేసే సమయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. దేవుడి వద్ద పెట్టే దీపాన్ని సాధారణంగా అగ్గిపుల్లతో వెలిగిస్తుంటాం. అయితే అలా వెలిగించటం అపచారమట. దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుల్లతో క్యాండిల్ ను వెలిగించి ఆ తరువాత కొవ్వొత్తితోనే దీపాలను వెలిగిస్తే మంచిదట. ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం పొందినవారు అవుతారని పండితులు చెబుతున్నారు.
దేవుడికి నైవేద్యం తప్పక పెట్టాలి. నీరు, నైవేద్యం పెట్టాకే పూజ చేయాలని పండితులు అంటున్నారు. అంతేకాదు పూజను ఏ సమయంలో చేసినా కొన్ని నియమాలు పాటించాలి.పూజ చేసే సమయంలో ఇంటి తలుపు తెరిచే ఉంచాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు, బయట చెత్తను ఉంచకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుని వాకిలి ఊడ్చి, కల్లాపు చల్లి, అందమైన ముగ్గులు వేయాలి. ఎవరి ఇంటి ముందు అలంకరణ చక్కగా ఉంటే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రతీ రోజు ఎంత బిజీ లైఫ్ ఉన్నా పూజ చేయడం మాత్రం మానకూడదు.