ఎలాంటి మందులు వాడకుండా బీపీ తగ్గించే చిట్కాలు.. డాక్టర్‌తో అవసరమే ఉండదు..!

www.mannamweb.com


జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటివి ప్రస్తుతం యువతకు కూడా కామన్‌గా వస్తున్నాయి.

హై బీపీ వస్తే, రక్తపోటును కంట్రోల్ చేసే మందులు వాడాలి. కానీ ఎక్కువ కాలం మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అయితే ఎలాంటి మెడిసిన్ వాడకుండానే అధిక రక్తపోటును అదుపులో ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి.

అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. అంటే రక్తపోటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం. హై బీపీ ఎక్కువ కాలం కొనసాగితే గుండె ధమనులు దెబ్బతింటాయి. దీంతో గుండె ఆగిపోవడం, పక్షవాతం, మూత్రపిండాల్లో రాళ్లు, కంటి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మెదడు పనితీరు మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. మాయో క్లినిక్ ప్రకారం.. ఆరోగ్యకరమైన జీవనశైలితో బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందుకు లైఫ్‌స్టైల్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకోండి.

* ఉప్పు వద్దు

ఉప్పు అధిక రక్తపోటుకు కారణమవుతుంది. తినే ఆహారంలో ఉండే సోడియం, ఇతర లవణాలు రక్తం సరఫరా అయ్యే ట్యూబ్స్‌లో పేరుకుపోయి గుండెపై ఒత్తిడి పెంచుతాయి. దీంతో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. అందుకే ఉప్పు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.

* రెగ్యులర్‌గా వర్కౌట్స్

రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ లేదా శారీరక శ్రమ చేస్తే అధిక రక్తపోటు సైతం తగ్గుతుంది. ఇది దాదాపు 5 నుంచి 8 mm Hg వరకు తగ్గే వీలు ఉంటుంది. రక్తపోటు మళ్లీ పెరగకుండా ఉండాలంటే, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం కొనసాగించాలి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్‌లు చేయడం మంచిది.

* వెయిట్ మేనేజ్‌మెంట్

హెల్తీ వెయిట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తే రక్తంలో షుగర్ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు కాస్త బరువు తగ్గినా రక్తపోటు తగ్గుతుంది. అందుకే మందులు వాడటానికి బదులు బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

* హెల్తీ డైట్

హై బీపీతో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లో ఫ్యాట్ డెయిరీ ప్రొడక్ట్స్, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుకు చెక్ పెడతాయి.

* కంటినిండా నిద్ర

మనిషి ఆరోగ్యంలో నిద్ర కీలకం. రాత్రి నిద్ర సమయాల్లో శరీర కణాల మరమ్మతు జరుగుతుంది. దీంతో ఉదయం రీఫ్రెష్‌గా, ఉల్లాసంగా ఉంటారు. సరైన నిద్ర రక్తపోటును నియంత్రిస్తుంది. అందుకే రోజూ కనీసం ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో మంచి నిద్ర పోవడానికి శరీరంలో అవసరమైన మార్పులు చోటుచేసుకుంటాయి.