Tirumala – seven Hills – History Behind the seven hill names – ఏడు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే…

www.mannamweb.com


Tirumala – seven Hills – History Behind the seven hill names – ఏడు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే… ఏడు కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే… తిరుమలలో ఉండే ఏడు కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడు కొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర… శేషాద్రి – సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆదిశేషుని పేరిట నెలకొన్న కొండ. నీలాద్రి – స్వామివారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదుగానే ఈ కొండ వెలసింది. గరుడాద్రి – మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో ఉద్భవించాడు. అంజనాద్రి – హనుమంతుని తల్లి సంతానం కోసం తపస్సు చేసిన కొండే అంజనాద్రిగా వెలసింది. వృషభాద్రి – మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి వచ్చింది. నారాయణాద్రి – విష్ణుమూర్తి దర్శనం కోసం పుష్కరిణి తీరంలో తపస్సు చేసిన నారాయణ మహర్షి పేరుతో నారాయణాద్రి వెలసింది. వేంకటాద్రి – కలియుగ దైవం వెలసిన కొండ ఇది. ‘వేం’ అంటే పాపాలు అనీ, ‘కట’ అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సన్నిధిలో సర్వపాపాలూ నశిస్తాయనీ, అందుకే ఆ పవిత్ర గిరిని వేంకటాద్రి అంటారనీ ప్రతీతి.
Tirumala – seven Hills – History Behind the seven hill names – ఏడు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే…

ఏడు కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే…

తిరుమలలో ఉండే ఏడు కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడు కొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర…
శేషాద్రి – సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆదిశేషుని పేరిట నెలకొన్న కొండ.
నీలాద్రి – స్వామివారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదుగానే ఈ కొండ వెలసింది.
గరుడాద్రి – మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో ఉద్భవించాడు.
అంజనాద్రి – హనుమంతుని తల్లి సంతానం కోసం తపస్సు చేసిన కొండే అంజనాద్రిగా వెలసింది.
వృషభాద్రి – మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి వచ్చింది.
నారాయణాద్రి – విష్ణుమూర్తి దర్శనం కోసం పుష్కరిణి తీరంలో తపస్సు చేసిన నారాయణ మహర్షి పేరుతో నారాయణాద్రి వెలసింది.
వేంకటాద్రి – కలియుగ దైవం వెలసిన కొండ ఇది. ‘వేం’ అంటే పాపాలు అనీ, ‘కట’ అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సన్నిధిలో సర్వపాపాలూ నశిస్తాయనీ, అందుకే ఆ పవిత్ర గిరిని వేంకటాద్రి అంటారనీ ప్రతీతి.