Tirumala Visit: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని ఏ నక్షత్రం రోజు దర్శిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా..? ఆ స్వామిని దర్శించడానికి ప్రత్యేక సమయమంటూ ఏదీ లేదు. కాలపురుషుడైన ఆ పరబ్రహ్మమూర్తిని దర్శించడానికి అన్ని కాలాలూ మంచివేనట కానీ ఒక్కొక్క నక్ష్మత్రం నాడు దర్శిస్తే ఒక్కొక్క ప్రత్యేక ఫలితం లభిస్తుందట.
అశ్వనీ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే.. ఎటువంటి అనారోగ్య సమస్య అయినా తీరిపోతుందట.
భరణీ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామిని దర్శించినవారికి అపమృత్యుభయం తొలగిపోతుందట.
కృత్తికా నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే విద్యలో రాణిస్తారట. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారట.
రోహిణీ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఎటువంటి మానసిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయట.
మృగశిర నక్షత్రం: ఈ నక్షత్రం స్వామికి ఎంతో ఇష్టమైనదట. ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే సర్వ శుభాలు కలుగుతాయట.
ఆరుద్ర నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఎటువంటి ఆపదలూ కలుగవట.
పునర్వసు నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఎటువంటి కస్టాలైనా తొలగిపోతాయట. ప్రత్యేకించి ఆర్థిక బాధలు ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు పునర్వసు నాడు స్వామిని దర్శిస్తే చాలా మంచిదట. కుటుంబంలోశాంతి సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయట.
పుష్యమీ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే వెయ్యి జన్మల పాపం నశిస్తుందట.
ఆశ్లేష నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఎటువంటి భయాలైనా తొలగిపోతాయట. శారీరక మానసిక సమస్యలన్నీ తీరిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుందట.
మఖా నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయట.
పూర్వ ఫల్టుణి (పుబ్బ) నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే పెళ్లి కానీ అమ్మాయి, అబ్బాయిలకు త్వరగా వివాహం అవుతుందట.
ఉత్తరఫల్డుణి నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయట. ఎంతో ఐశ్వర్యవంతులు అవుతారట.
హస్తా నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్యమైనా క్షణంలో తొలగిపోతుందట.
చిత్తా నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే యశస్సు, సకల సంపదలు కలుగుతాయట. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుందట.
స్వాతి నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే అపమృత్యు భయం తొలగిపోతుందట. ఎటువంటి ప్రమాదాలు, ఆపదలు జరగవట.
విశాఖ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే వివాహం కానీ యువతీయువకులకు మంచి వ్యక్తులతో పెళ్లి అవుతుందట.
అనూరాధ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే సర్వసౌభాగ్యాలు కలుగుతాయట. ఎంతో కాలం నుండి తీరని అప్పులు కొద్ది నెలల్లోనే తీరిపోతాయట.
జ్యేష్టా నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఉన్నత పదవులు లభిస్తాయట. సర్వసంపదలూ చేకూరుతాయట.
మూలా నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే సర్వవిద్యలూ లభిస్తాయట. విద్యార్థులు పరీక్షలలో అద్భుత విజయం సాధిస్తారట.
పూర్వాషాఢ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఎంతో సంపద కలుగుతుందట.
ఉత్తరాషాఢ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా తొలిగిపోతాయట. సర్వసౌభాగ్యాలు కలుగుతాయట. మనస్సంతా ప్రశాంతత కలుగుతుందట.
శ్రవణా నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే జీవించినంత కాలం సుఖంగా దేనికీ లోటు లేకుండా జీవితమంతా సాఫీగా జరిగిపోతుందట. మరణం తర్వాత ముక్తిని పొందుతారట.
ధనిష్టా నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఐశ్వర్యం లభిస్తుందట. ఎంతో కాలంగా రావలసిన సొమ్ము వెంటనే చేతికి వస్తుందట.
శతభిష నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయట. సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయట.
పూర్వాభాద్ర నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయట.
ఉత్తరాభాద్ర నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే చక్కటి సంతానం కలుగుతుందట.
రేవతీ నక్షత్రం: ఈ నక్షత్రంలో స్వామి వారిని దర్శిస్తే సర్వశుభాలూ కలుగుతాయట. ఎటువంటి అనారోగ్యమైనా క్షణంలో తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందట.
అయితే తిరుమల వెళ్లలేని భక్తులు మరేదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నా అవే ఫలితాలు ఉంటాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.



































