365 రోజులు ఎంతసేపైనా మాట్లాడుకునేలా..

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ఇయర్లీ ప్లాన్‌


డ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు అందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను తక్కువ ధరలకు అందించడం ద్వారా తన యూజర్ బేస్‌ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తన తాజా ఆఫర్లలో కేవలం రూ.1,999 ధరతో ఇయర్లీ ప్లాన్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ చేస్తున్న ఈ ప్లాన్‌ను పోటీ టెలికాం సంస్థల కంటే తక్కువ ధరకే అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

వ్యాలిడిటీ: 365 రోజులు

డేటా: ఒకేసారి 600 జీబీ(రోజువారీగా 1.64 జీబీ)

వాయిస్ కాలింగ్: అపరిమిత కాల్స్‌ చేయవచ్చు.

ఎస్‌ఎంఎస్‌: రోజుకు 100

ప్లాన్‌ ధర: రూ.1,999

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇలాంటి సరికొత్త ప్లాన్లును తీసుకొస్తుంది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అందిస్తున్నట్లు, ఇండిపెండెన్స్‌డే సందర్భంగా ఈ ఆఫర్‌ ప్రకటిస్తున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.