ఆంధ్రప్రదేశ్ ( AP) రాష్ట్ర రైతులకు ( Farmers) బిగ్ అలర్ట్. అన్నదాత సుఖీభవ పథకం పై ( Annadata Sukhibhava) కీలక అప్డేట్ వచ్చింది.
ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇవాల్టితో… ముగియబోతోంది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాలో పేరు లేని రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయాలని ఇప్పటికే ఏపీ వ్యవసాయ శాఖ సూచనలు చేసింది.
ఈ నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వాళ్ళు అందరూ.. ప్రభుత్వం చెప్పినట్లు తమ పేర్లను రూల్స్ ప్రకారం నమోదు చేయించుకున్నారు. ఇంకా ఎవరైనా రైతులు ఉంటే ఇవాళ.. అధికారులను కలవాలని సూచనలు చేశారు. అలాగే రైతులు తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు 155251 అనే నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ నెంబర్ కు ఫోన్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చని పేర్కొన్నారు అధికారులు. ఇక మోడీ ప్రభుత్వం ఇచ్చే 2000 రూపాయలతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం త్వరలోనే 5000 రూపాయలు జమ చేయనుంది.
అంటే మొత్తంగా ఒక్కో రైతుకు.. ₹7,000 జమ కానున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆగస్టు రెండో తేదీన ఈ డబ్బులు పడే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు రెండో తేదీన వారణాసిలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పిఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు విడుదల చేస్తారని జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా 5000 రూపాయలు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
































