పౌర్ణమి తిథిరోజున కొన్ని పనులు చేస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్ముతుంటారు. అలాంటిది మార్గశిర పౌర్ణమి రోజున బ్రహ్మముహూర్తం చాలా దైవిక శక్తి కలదని పండితులు చెప్తున్నారు.
మార్గశిరమాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే గీతలో అభివర్ణించాడని, అందుకే మార్గశిరంలో వచ్చే పూర్ణిమను మహా పూర్ణిమగా పిలుస్తారని చెప్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 4న.. అంటే రేపు మార్గశిర పూర్ణిమ.
గురువారం బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి, ధ్యానం చేయడం, దానం చేయడం వల్ల జీవితంలో శుభాలు జరుగుతాయని నమ్మకం. స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి, ఆ నీటిని తలపై చల్లుకుని నమస్కారం చేయాలి. ఆపై స్నానం ఆచరించి, సూర్యుడు ఉదయించే దిక్కులో నమస్కారం చేయాలి. తెల్లని లేదా పసుపురంగు దుస్తులు వేసుకోవడం శుభప్రదం.
ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను జపించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉదయం 4.19 గంటల నుంచి 4.58 మధ్య బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో 4 మంత్రాలను పఠిస్తే సిరిసంపదలు కలుగుతాయి.
1. ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసిద్ధః
2. శ్రీ హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మమాయై నమః
3. ఓం శ్రీం శ్రీం శ్రీం శ్రీం సః చంద్రాంశే నమః
4. ఓం నమః నారాయణాయ్ నమో నమః
శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఇంటిలో శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. సాయంత్రం శని ఆలయాన్ని సందర్శించి, శని దేవుడికి తెలుపు రంగులో ఉండే ఏదేని స్వీటును నైవేద్యంగా సమర్పించాలి. శివుడు, శనిదేవులను పూజించే సమయంలో ఓం నమఃశివాయ, ఓం శనేశ్చరాయ నమః మంత్రాలు జపించడం వల్ల, వృత్తి వ్యాపారాల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.
































