దీపావళి కి 70 వేల లోపు లభించే టాప్ 5 ఫ్యామిలీ బైక్స్ …మైలేజ్,పెర్ఫార్మన్స్ లో ఇవి టాప్

 దీపావళి పండగకి తక్కువ బడ్జెట్ లో బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్లు తమ ఎంట్రీ లెవల్ మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు , ఈఎంఐ ఆప్షన్స్ అందిస్తున్నాయి.


TVS, Hero, Honda, Bajaj వంటి కంపెనీలు స్టైలిష్ డిజైన్, మైలేజ్, విశ్వసనీయత కలిగిన బైక్‌లను 70,000 లోపు ధరలోనే మార్కెట్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.తక్కువ డౌన్ పేమెంట్, ఫెస్టివల్ క్యాష్‌బ్యాక్, ఫైనాన్స్ స్కీమ్‌లతో ఈ దీపావళి కి మీకు ఇష్టమైన బైక్‌ను ఇంటికి తీసుకెళ్లండి.సరైన ధరలు,ఆఫర్స్ వివరాలకోసం స్థానిక షోరూమ్‌లను సందర్శించండి లేదా ఆన్లైన్‌లో ఆఫర్లు పరిశీలించండి.70,000 లోపు ఉన్న టాప్ 5 బైక్స్ ధరలు,మైలేజ్,ఫీచర్స్,మోడల్స్
హీరో HF 100

హీరో HF 100 మోడల్ బైక్ 97.2cc ఎయిర్ కూల్డ్,సింగల్ సిలిండర్ , 4 స్ట్రోక్ ఇంజన్ తో వస్తుంది.ఈ ఇంజన్ 5.9 kW @ 8000 rpm పవర్,8.05 Nm @ 6000 rpm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.దీనిలో కిక్ స్టార్ట్ ఉంటుంది.ఇది 4 స్పీడ్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటుంది.ముందు టేలీస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ సస్పెన్షన్ ఉంటుంది.వెనుక 2 స్టెప్ అడ్జెస్ట్ హైడ్రాలిక్ షాక్ సస్పెన్షన్ ఉంటుంది.ఫ్రంట్ & బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.ఈ బైక్ 165mm గ్రౌండ్ క్లియరెన్సు కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.1L ఉంటుంది.ఇది రెడ్ బ్లాక్,బ్లూ బ్లాక్ షేడ్స్ కలర్ లలో వస్తుంది.దీని మైలేజ్ 70KMPL గా ఉంది.హీరో HF 100 మోడల్ బైక్ ధర 58,739/-
హోండా షైన్ 100

హోండా షైన్ 100 బైక్ 98.98 cc 4 స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ తో వస్తుంది.దీని ఇంజన్ 5.43 kW పవర్,8.05 Nm టార్క్ ను అందిస్తుంది.ఈ బైక్ సెల్ఫ్ స్టార్ట్ ,కిక్ స్టార్ట్ రెండు ఆప్షన్ లను కలిగి ఉంటుంది.ఇది 4 గేర్ బాక్స్ తో వస్తుంది.దీనిలో మల్టీ ప్లేట్ వెట్ క్లచ్ ఉంటుంది.కొత్త డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్,CBS బ్రేకింగ్ సిస్టం,స్టయిలిష్ గ్రాఫిక్స్,అలోయ్ వీల్స్,లాంగ్ కంఫర్ట్ సీట్ ఉంటుంది.రోడ్స్ కు అనువైన డైమండ్ ఫ్రేమ్,స్ట్రాంగ్ గ్రాబ్ రెయిల్,టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్,ట్విన్ బ్యాక్ సస్పెన్షన్,9L పెట్రోల్ ట్యాంక్,168 mm గ్రౌండ్ క్లియరెన్సు,99kg బరువు కలిగి ఉంటుంది.హోండా షైన్ 100X వారంటీ 3 ఇయర్స్ లేదా 42000km రెండింటిలో ఏది మూడు వస్తే అది కలిగి ఉంటుంది.ఇది 70 kmpl వరకు మైలేజ్ ఇవ్వగలదు. Honda Shine 100 ఎక్స్ షోరూమ్ ధర 63,191.
టీవీఎస్ స్పోర్ట్

టీవీఎస్ స్పోర్ట్ 110cc 4 స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ 8bhp పవర్,8.7nm టార్క్ ను అందిస్తుంది.ఇది 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్.దీనిలో ఇగ్నిషన్ సిస్టం ఉంటుంది.ముందు అలాగే వెనుకాల డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.దీనికి రియర్ 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్సర్బెర్ ఉంటాయి.ట్యూబ్ లెస్ అల్లోయ్ వీల్స్ ఉంటాయి.టీవీఎస్ స్పోర్ట్ వారేంటి 5 ఇయర్స్ ఉంటుంది. 112kg బరువుతో సిటీలో,హైవేలో డ్రైవింగ్ చేయడానికి చాల బాగుంటుంది. .ఇది మైలేజ్ 70kmpl అందిస్తుంది. టీవీఎస్ స్పోర్ట్ ఎక్స్ షో రూమ్ ధర 59,800/-.
టీవీఎస్ RADEON

టీవీఎస్ RADEON 109.7 CC ,4 స్ట్రోక్ ఇంజన్ 6.03 kW @7350 rpm పవర్,8.7 Nm @ 4500 rpm టార్క్ ను అందిస్తుంది.దీనిలో 4 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది.డిజి క్లస్టర్ ఉంటుంది.రియల్ టైం మైలేజ్ డిస్ప్లే,లో ఫ్యూయల్ ఇండికేషన్,క్లాక్,సర్వీస్ ఫీచర్స్ ఉంటాయి.దీనికి కంఫర్ట్ లాంగ్ సీట్ ఉంటుంది.USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది.సెల్ఫ్ స్టార్ట్ ,MF బ్యాటరీ ,18 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. SBT బ్రేకింగ్ టెక్నాలజీ ,ఫ్రంట్ డ్రమ్ ,బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.ఇది 73.68kmpl మైలేజ్ ఇస్తుంది.80 mm గ్రౌండ్ క్లియరెన్సు కలిగి ఉంటుంది. టీవీఎస్ RADEON ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర 55,100/-
బజాజ్ ప్లాటినా 110

ప్లాటినా 110 బైక్ 115.45 cc 4 స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ 6.33 kW పవర్,9.81 Nm టార్క్ ను అందిస్తుంది.దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.దీని టాప్ స్పీడ్ 90 kmph ,అనలాగ్ స్పీడోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్,బేసిక్ ఇండికేటర్స్,SnS సస్పెన్షన్,LED DRLs ,కొత్త టెయిల్ లైట్స్ & మిర్రర్స్ ఉంటాయి.11L కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ,ఫ్రంట్ డ్రమ్ బ్రేక్స్,బ్యాక్ ABS తో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.200 mm గ్రౌండ్ క్లియరెన్సు ఉంటుంది.ఇది మూడు కలర్స్ లో వస్తుంది.65 kmpl వరకు మైలేజ్ ఇవ్వగలదు. Platina 110 డ్రమ్ బ్రేక్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్ ధర 69,284.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.