సెప్టెంబర్ 2024 సబ్ 4 మీటర్ ఎస్‌యూవీల అమ్మకాల నివేదిక విడుదలైంది. నెంబర్ 1 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా బ్రెజ్జా నిలిచింది. ఆ తర్వాత ఫ్రాంక్స్, పంచ్, నెక్సాన్, సోనెట్, వెన్యూ ఉన్నాయి. ఈ లిస్టు ఓసారి చూద్దాం..
సెప్టెంబర్ నెలకు సంబంధించి సబ్ 4 మీటర్ల ఎస్‌యూవీ సెగ్మెంట్ మోడళ్ల వారీగా అమ్మకాల నివేదికలు వెలువడ్డాయి. అనేక మోడళ్లు మంచి వృద్ధిని సాధించాయి. అదే సమయంలో మరికొన్ని మోడళ్ల అమ్మకాలు క్షీణించాయి. మారుతి సుజుకి బ్రెజ్జా, ఫ్రాంక్స్ టాప్-2లో నిలవగా టాటా పంచ్, నెక్సాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో టాప్-12 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు చూద్దాం..
మారుతి బ్రెజ్జా 2024 సెప్టెంబర్‌లో 15,322 యూనిట్ల అమ్మకాలతో ఈ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇది 2023 సెప్టెంబర్‌లో విక్రయించిన 15,001 యూనిట్లతో పోలిస్తే 2.14 శాతంతో స్వల్ప పెరుగుదల. ఈ విభాగంలో 15.84 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2024 సెప్టెంబర్లో 20.33 శాతం వృద్ధిని నమోదు చేసిన ఫ్రాంక్స్ రెండో స్థానంలో ఉంది.
టాటా పంచ్, దాని ఈవి వేరియంట్ల అమ్మకాలు గత కొన్ని నెలలుగా క్షీణించాయి. ఏడాదికి పలుమార్లు నెం.1గా నిలిచిన ఆ తర్వాత 2024 సెప్టెంబర్లో నెంబర్ 3కి పడిపోయింది. టాటా పంచ్ 2024 సెప్టెంబర్లో 13,711 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 13,036 యూనిట్లతో పోలిస్తే 5.18 శాతం వృద్ధి చూసింది.
టాటా నెక్సాన్ ఈ సెప్టెంబర్లో దాని ఈవీ వేరియంట్లతో సహా అమ్మకాలలో గణనీయమైన క్షీణతను చూసింది. 2023 సెప్టెంబర్లో విక్రయించిన 15,325 యూనిట్లతో పోలిస్తే 3,855 యూనిట్లు తగ్గి 11,470 యూనిట్లను విక్రయించింది.
సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో కియా సోనెట్ అమ్మకాల్లో 107.36 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023 సెప్టెంబర్లో 4,984 యూనిట్లతో పోలిస్తే 2024 సెప్టెంబర్లో 10,335 యూనిట్ల అమ్మకాలతో సోనెట్ తన అమ్మకాలను రెట్టింపు చేసింది.
హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. 2023 సెప్టెంబర్లో 12,204 యూనిట్లతో పోలిస్తే 2024 సెప్టెంబర్లో 10,259 యూనిట్ల అమ్మకాలతో 15.94 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సెగ్మెంట్లో వెన్యూ మార్కెట్ వాటా ఇప్పుడు 10.60 శాతానికి పడిపోయింది.
మహీంద్రా ఎక్స్యూవీ3ఎక్స్ఓ సెగ్మెంట్లో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. అమ్మకాలు 81.42 శాతం పెరిగాయి. ఇది 2024 సెప్టెంబరులో 9,000 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇది ఏడాది క్రితం విక్రయించిన 4,961 యూనిట్లతో పోలిస్తే గణనీయమైన మెరుగుదల.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ అమ్మకాలు 20.11 శాతం క్షీణించాయి. 2023 సెప్టెంబర్లో 8,647 యూనిట్లు ఉండగా 2024 సెప్టెంబర్ నాటికి 6,908 యూనిట్లకు తగ్గింది. ఈ క్షీణత ఉన్నప్పటికీ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్స్‌టర్ ఇప్పటికీ 7.14 శాతం వాటాను కలిగి ఉంది.
సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ టయోటా తైసర్ 5,000 కంటే తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. సెప్టెంబర్ 2024లో 2,278 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలలో 14.43 శాతం క్షీణతను చవిచూసింది. 2024 సెప్టెంబర్లో కేవలం 2,100 యూనిట్లు మాత్రమే విక్రయించింది.
రెనాల్ట్ కిగర్ స్వల్ప పెరుగుదలను చూపించింది. 2023 సెప్టెంబర్లో 980 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 988 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది 2024 సెప్టెంబర్లో 0.82 శాతం పెరిగింది.
మారుతి సుజుకి సెగ్మెంట్లో అత్యంత క్షీణతను ఎదుర్కొంది. అమ్మకాలు సంవత్సరానికి 77.40 శాతం పడిపోయాయి. 2023 సెప్టెంబర్లో 2,651 యూనిట్లు అమ్ముడుపోగా, 2024 సెప్టెంబర్లో కేవలం 599 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.