తెలంగాణలో కుండపోత వర్షాలు.. నేడు 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో ఈ రోజు సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ్‌పేట్, వనపర్తి, గద్వాల్, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో మద్యాహ్నం నుండి రాత్రి వరకు తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


అదే విధంగా మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక హైదరాబాద్ లో మద్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండి తరవాత రాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అంతే కాకుండా వాతావరణశాఖ నేడు 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.