Moon : చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. అంటూ చిన్నప్పుడు చందమామను చూపిస్తూ పిల్లలకు తల్లులు అన్నం తినిపించే దృశ్యాలు ఇప్పటికీ గ్రామాల్లో మననకు కనిపిస్తుంటాయి. అయితే ఆ చందమామ రాదని పిల్లలకు తెలియదు. తల్లులకు తెలుసు. కానీ, పిల్లలను ముద్దు చేస్తూ.. పిల్లలు చంద్రున్ని పిలుస్తుంటారు. ఇన్నాళ్లూ అందదు అని భావించిన చందమామ అందే రోజులు అతిత్వరలోనే రానున్నాయంటున్నారు పరివోధకులు. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవలే భారత్ చంద్రయాన్ –3 లో భాగంగా రాకెట్‌ను చంద్రుడిపైకి పంపించింది. రెండు చంద్రయాన్–1, చంద్రయాన్ –2 విఫలమైనా.. చంద్రయాన్ – 3తో భారత్ కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు చంద్రుడిపైకి వెళ్లేందుకు ఇతర దేశాలు చేసిన ఖర్చుకన్నా తక్కువ ఖర్చుతో శాటిలైటను భారత్ చంద్రుడిపైకి పంపింది. ఈ శాటిలైట్ సూర్యుడి శక్తి ఆధారంగా పనిచేసింది. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన ఉప గ్రహం సుమారు ఐదు రోజులపాటు అక్కడి దృశ్యాలను కిందకు పంపించింది. తర్వాత చీకటి రావడంతో పనిచేయడం మానేసింది. ఇక ఇదే సమయంలో రష్యా కూడా ఉప గ్రహాన్ని చంద్రుడిపైకి పంపించింది. కానీ, అది విజయవంతం కాలేదు. ఆ తర్వాత చైనా కూడా చంద్రుడి అవతలివైపు ఉపగ్రహానిన విజయవంతంగా లాంచ్ చేసింది. చాంగే – 5 సాయంతో జాబిల్లి నుంచి భూమికి మట్టిని తీసుకువచ్చిన చైనా.. నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఈ క్రమంతో ఈ పరిశోధనల ఫలితాల ఆధారంగా చంద్రునిపై నీరు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాన్ని చైనీస్ అకాడమ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.
మట్టి నమూనాల విశ్లేషణ..
చంద్రుడిపై మట్టి నమూనాల సేకరణ నలక్ష్యంగా చైనా 2020లో చేపట్టిన చాంగే – 5 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది.అనంతరం వాటిపై బీజింగ్‌లోని నేషనల్ లేబొరేటరీ ఫర్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్, సీఏఎస్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఆ నామూనాల్లో విస్తృత స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు సీఏఎస్ ఇటీవల పేర్కొంది. ఇందుఉ సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఓ జర్నల్‌లో ప్రచురించినట్లు పేర్కొంది.
40 ఏళ్ల క్రితం అమెరికా..
ఇదిలా ఉండగా జాబిల్లిపై పరిశోధనలో భాగంగా అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు 40 ఏళ్ల క్రితమే చంద్రునిపైకి వెళ్లి మట్టి నమూనాలు సేకరించారు. అనంతరం సోవియట్ యూనియన్ కూడా 1976లో చంద్రుడిపై మట్టి నమూనాలను భూమికి తీసుకువచ్చింది. ఈ రెండు దేశాల తర్వాత జాబిల్లి నుంచి మట్టిని సేకరించిన మూడో దేశం చైనా.. అయితే 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్–1 వ్యోమనౌక చంద్రుడిపై నీటిజాడ ఉన్నట్లు గుర్తించింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదు. దీంతో భారత వాదనను ఎవరూ విశ్వసించలేదు. కానీ, భారత వాదననే ఇన్నేల్లకు నిజమైంది. భారత వాదనే నిజమని చైనా ధ్రువీకరించింది.