మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఎన్నో మనకు అంతుచిక్కని రహస్యాలు దాగి ఉంటాయి. కొన్ని పద్ధతులను మన ఆచారంగా పూర్వకాలం నుంచి ఆచరిస్తూ వస్తున్నారు.
మానవులు తల్లిగర్భంలో జీవం పోసుకున్నప్పటినుంచి చనిపోయేవరకు 16 కర్మలు జరిపించాలని మన భారతీయ ధర్మం సూచిస్తుంది. మనం చేసే అన్ని కార్యాల అర్థం పరమార్థం ఎవరికీ తెలియదు. ఏదో పెద్ద వారు చెబుతున్నారు కాబట్టి ఆచరిస్తున్నాం అన్న సమాధానం మాత్రమే వస్తుంది. ఇందులో భాగంగానే పుట్టిన పిల్లలకు పుట్టు వెంట్రుకలు కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే సమర్పిస్తారు. అలా ఇవ్వడం వెనుక గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా దేవునికి తలనీలాలు ఇవ్వడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. పురాణాల ప్రకారం మన తల వెంట్రుకలు పాపాలకు నిలయమని చెబుతున్నాయి. అందువల్ల ఈ వెంట్రుకలను దేవుడికి సమర్పించడం ద్వారా పాపాలను దేవుని సన్నిధిలో తొలగించినట్లు అని అర్థం. అయితే శిశువు జన్మించినప్పుడు మొదటగా తన తల నేలను తాకి బయటకు వస్తాడు. ఆ శిశువు తల వెంట్రుకలకు పూర్వజన్మ పాపాలు ఆ వెంట్రుకలకు అంటిపెట్టుకొని ఉంటాయి. అందుకోసమే పుట్టిన బిడ్డకు చిన్నతనంలోనే పుట్టు వెంట్రుకలు తీయించి ఆ పాపాలను తొలగించేస్తారు.
సాధారణంగా పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపు తీస్తారు. మరి కొందరు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలలో తీస్తారు. అంతేకాకుండా పుట్టు వెంట్రుకలు తీయించడానికి సరైన ముహూర్తాన్ని చూసుకుని తీస్తారు. సరైన ముహూర్తంలో పుట్టెంట్రుకలు తీయడం ద్వారా గతజన్మ పాప ప్రక్షాళనతో పాటు, మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉండేందుకు సరేనా ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. పుట్టు వెంట్రుకలు ఎప్పుడు కూడా సోమ, బుధ, గురు, శుక్రవారాలలో అదికూడా మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే తీయించాలి.ఇలా చేయడం ద్వారా పూర్వ జన్మ పాపాలు అంతటితో అంతమైపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి.