జనవరి నుంచి హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య 5 గంటల సమయం తగ్గుతోంది

చ్చే జనవరి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం 5 గంటలు తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం ఖమ్మం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి జంక్షన్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి.


ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.4054 కోట్ల వ్యయంతో ప్రారంభమైన పనులు తుది దశకు చేరుకున్నాయి. దీనిపై ప్రతి వాహనం 100 కిలోమీటర్ల వేగంతో నిర్మించేలా నిర్మాణం జరుగుతోంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కేవలం 11 ఎగ్జిట్సే ఉంటాయి. విశాఖపట్నం వెళ్లేవారు విజయవాడ వెళ్లే అవసరం లేకుండా ఖమ్మం, సత్తుపల్లి మీదుగా దేవరపల్లి జంక్షన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వెళతారు.

125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది

జాతీయ రహదారు ప్రాథికార సంస్థ నిర్వహిస్తున్న ఈ రహదారి పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఉన్న 676 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే 12 గంటల సమయం పడుతోంది. రైలులో వెళ్లాలన్నా ఇదే సమయం పడుతోంది. అలా కాకుండా ఈ హైవే అందుబాటులోకి వస్తే 125 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. హైవే మొత్తం పొడవు 162 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గించడంతోపాటు ఇంధనాన్ని ఆదా చేయడం, సరకు రవాణాను వేగవంతం చేయడం జరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న రహదారి అధ్వాన్న

ప్రస్తుతం విజయవాడ వెళ్లకుండా కొంతమంది సూర్యాపేట నుంచి ఖమ్మం, వైరా, అశ్వరావుపేట, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మీదగా దేవరపల్లి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి చేరుకొని ఆ మార్గంలో రాజమండ్రి, వైజాగ్ చేరుకుంటున్నారు. అయితే భారీ వాహనాలు, తెలంగాణ నుంచి సరకు రవాణా, గ్రానైట్.. తదితర లారీలన్నీ ఈ మార్గంలోనే వెళుతుండటంతో అద్వాన్నంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించడానికే అత్యధిక సమయం పడుతోంది. ఖమ్మం – దేవరపల్లి హైవే అందుబాటులోకి వచ్చిన తర్వాత రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం మధ్య వాహనాలు రయ్ రయ్ మని పరుగులు తీయనున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.