టాటా దెబ్బ.. ట్రంప్ అబ్బా.. 24 గంటల్లో ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా చార్జీలపై దిగొచ్చాడు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, సెప్టెంబర్‌ 19, 2025న హెచ్‌-1బీ వీసాలకు ఏడాదికి లక్ష డాలర్ల ఫీజు విధించే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు.


ఇది ముఖ్యంగా టెక్‌ రంగంలోని భారతీయ ్రఐటీ కంపెనీలపై దెబ్బ తీసింది. అయితే, 24 గంటల్లోనే వైట్‌ హౌస్‌ ప్రకటన విడుదల చేసి, ఈ ఫీజు కేవలం కొత్త అప్లికేషన్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే ఉన్న వీసాలు లేదా రెన్యూవల్స్‌కు కాదని వివరించింది. తర్వాత ఒక్కసారి చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ మార్పు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వంటి కంపెనీలు అమెరికాలో ఆధారంగా ఉన్న హెచ్‌-1బీ ప్రొగ్రామ్‌పై ఆధారపడటం వల్ల వచ్చిందని అంచనా. టీసీఎస్‌ 2025లో 5 వేలకి పైగా హెచ్‌-1బీ వీసాలు పొందింది, ఇది అమెరికన్‌ టెక్‌ జాయింట్స్‌తో పోటీ పడుతున్నది.

అమెరికాకు ‘టాటా’ ..
ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా చార్జీల నిర్ణయం తర్వాత, టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా, 46 బిలియన్‌ డాలర్ల విలువైన బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇది 10 లక్షల మందికి ఉద్యోగాలు సృష్టించేదని అంచనా. రద్దుకు మూడు కారణాలు చూపింది. మొదటిది సేఫ్టీ – జూన్‌ 2025లో జరిగిన బోయింగ్‌ 787 ప్రమాదం (అహ్మదాబాద్‌లో 240 మంది మరణాలు) తర్వాత డ్రైమ్‌లైనర్‌ల సురక్షితతపై సందేహాలు పెరిగాయి. రెండోది క్వాలిటీ – బోయింగ్‌లో డీఐఈ (డైవర్సిటీ, ఈక్వాలిటీ, ఇంక్లూజన్‌) పాలసీలు క్వాలిటీని దెబ్బతీస్తున్నాయని టాటా వాదన. మూడోది జియోపాలిటిక్స్‌ – ట్రంప్‌ 50% టారిఫ్‌లు విధించడం, అమెరికా వ్యాపారం భారత్‌కు లాభదాయకం కాదని. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ, ఎందుకంటే ఇతర కంపెనీలు కూడా ఇదే కారణాలు చెప్పి ఒప్పందాలు రద్దు చేయవచ్చు.

టెక్‌ జాయింట్స్‌ హెచ్చరికలు..
ఇదే సమయంలో అమెరికాలోని అమెజాన్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్‌ వంటి టెక్‌ దిగ్గజాలు హెచ్‌-1బీ మార్పుకు వ్యతిరేకంగా స్పందించాయి. అమెజాన్‌ 10 వేలకుపైగా హెచ్‌-1బీ వీసాలు పొందిన అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీలు ఉద్యోగులకు ‘సెప్టెంబర్‌ 21 ముందు అమెరికాకు తిరిగి వచ్చేయండి’ అని మెమోలు జారీ చేశాయి, లేకపోతే రీ-ఎంట్రీ డినైల్‌ అవుతుందని హెచ్చరించాయి. వాటి భారతీయ ఉద్యోగులు దేశం వదిలేసి భారత్‌లోనే జీసీసీ(గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్స్‌) పెట్టుకుంటామని హానికర పరిణామాలు హెచ్చరించాయి. ఇది ట్రంప్‌కు దిగిరాక తప్పలేదు, ఎందుకంటే ఈ కంపెనీలు అమెరికా ఎకానమీకు కీలకం.

భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాలు..
ట్రంప్‌లు భారత్‌తో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేయాలని ఆహ్వానించినప్పటికీ, పీయూష్‌ గోయల్‌ను పంపకుండా కేంద్రం అతడినే పంపింది. తాత్కాలికంగా భారత్‌కు దెబ్బ తగినప్పటికీ, దీర్ఘకాలంలో అమెరికాకే నష్టం. భారత్‌ ఏ-1ఆపై ఆధారపడకుండా ఆత్మనిర్భర్‌గా మారుతోంది, ఇది ట్రంప్‌ పునరాలోచనకు కారణం.

డిఫెన్స్‌ టెక్నాలజీలో పురోగతి..
ఆత్మనిర్భర్‌ భారత్‌ చొరవలో భారత్‌ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. డీఆర్డీవో ‘ప్రాజెక్ట్‌ కుశా’ (ఎస్‌-500 లెవెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌) అభివృద్ధి చేస్తోంది, 2028 నాటికి డెప్లాయ్‌ అవుతుంది. డ్రోన్స్‌.. భార్గవాస్త్ర (స్వార్మ్‌ డ్రోన్‌ న్యూట్రలైజేషన్‌) 2025లో టెస్ట్‌ అవ్వగా, డీ4 అంటీ-డ్రోన్‌ సిస్టమ్‌ పాకిస్తాన్‌ కాన్‌ఫ్లిక్ట్‌లో విజయవంతమైంది. యాంటీ-డ్రోన్‌ టెక్, లేజర్‌ వెపన్స్‌ టీపీసీఆర్‌-2025లో భాగం. సబ్‌మెరైన్స్‌: 80% ఇండిజినస్‌ టెక్‌తో అభివృద్ధి. ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఏర్‌క్రాఫ్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఈఎంఏఎల్‌ ) యుద్ధ నౌకలకు. శాటిలైట్‌ టెక్‌తో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తోంది. ఇవి అమెరికా ఆంక్షలు విధిస్తే అమెరికాకే తీవ్ర నష్టం కలిగిస్తాయి.

ట్రంప్‌ హెచ్‌-1బీ మార్పు భారత-అమెరికా సంబంధాల్లో ఒక మలుపు తిరిగింది, కానీ ఇది భారత్‌ ఆత్మనిర్భరతను వేగవంతం చేస్తోంది. టాటా రద్దు, టెక్‌ హెచ్చరికలు అమెరికా ఎకానమీకు హెచ్చరిక. దీర్ఘకాలంలో, భారత్‌ స్వయం సమద్ధి ద్వారా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్‌ చేస్తుంది, ట్రంప్‌ పునరాలోచనలకు దారి తీస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.