పండగ సీజన్‌లో ఒంట్లో కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలా..? ఈ సింపుల్‌ చిట్కాలు ట్రై చేయండి

www.mannamweb.com


మరి కొన్ని రోజుల్లో దీపావళి పండగ వస్తేంది. ఈ పండగ తెలుగు వారికి ఎంతో ప్రత్యేకం. ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అయితే రకరకాల పిండి వంటలు, స్వీట్లు తయారు చేసుకుని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. దీని వల్ల పెద్ద వాళ్లు ఉంటే మాత్రం ఆహారం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. లేదంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి లేనిపోని ఇబ్బందులకు దారి తీస్తుంది..
Cholesterol: పండగ సీజన్‌లో ఒంట్లో కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలా..? ఈ సింపుల్‌ చిట్కాలు ట్రై చేయండి..

దీపావళి పండుగ చాలా దగ్గరలో ఉంది. ప్రతి ఇంట్లో రకరకాల స్వీట్లు తయారు చేసి ఫుల్లుగా లాగించేస్తుంటారు. పండగ అంటేనే సంతోషాల సమయం. కానీ పండుగ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. పండుగల సమయంలో చాలా మంది ఎక్కువగా తింటారు. ఈ కారణంగా వారిలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పండగల సమయంలో ఇంట్లోని పెద్దలు స్వీట్లను తినడానికి ఇష్టపడతారు. సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వరుణ్ బన్సాల్ ఏం చెబుతున్నారంటే.. స్వీట్లు పరిమితికి మించి తీసుకుంటే, ఎల్‌డిఎల్ అంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఈ కాలంలో ముఖ్యంగా వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ఆహారం, పానీయాలపై శ్రద్ధ ఉంచాలి. పండగ వేళ తినండి. కానీ అతిగా తినకండి. అలాగే, అతిగా తినడాన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ద్రవ ఆహారం తీసుకోవాలి

ఈ సమయంలో తినే వంటకాల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో సరిపడా లిక్విడ్ డైట్ తీసుకోవాలని డాక్టర్ వరుణ్ చెబుతున్నారు. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉంచడానికి సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన జ్యూస్‌లు, తీపి పానీయాలకు బదులుగా కొబ్బరి నీరు, సాధారణ నిమ్మరసం, మజ్జిగ, లస్సీ తీసుకోవడం మంచిది.
కొవ్వు పదార్థాలు వద్దు

వేయించిన ఆహారం రుచిగా ఉంటుందనేది నిజమే కానీ అది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. అందువల్ల, పండుగ సమయంలో కొవ్వు, తీపి, అధిక కేలరీల ఆహారాన్ని తినవద్దు. బదులుగా మీ ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు, తృణధాన్యాలు చేర్చుకోండి. తద్వారా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగదు.

అతిగా తినడం మానుకోవాలి

పండుగల సమయంలో చాలా మంది అతిగా తింటారు. ఇది అసిడిటీ, కడుపు నొప్పి, అజీర్ణానికి కారణమవుతుంది. అందుకే పండుగల సమయంలో అతిగా తినడం మానుకోవాలి. ప్రతి కొన్ని గంటలకు కొద్దిగా కొద్దిగా తినడానికి ప్రయత్నించాలి.
చురుకుగా ఉండాలి

పండుగల సమయంలో తిన్న తర్వాత నీరసంగా అనిపించడం సహజమే. అయితే ఈ సమయంలో శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. అందుకే వాకింగ్‌కు వెళ్లాలి. రోజూ 30 నిమిషాల నడక అలవాటు చేసుకోవాలి.

పండుగల సమయంలో మీ ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇది సంతోషకరమైన పండుగ. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మరింత సంతోషంగా ఉండండి.

గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. వీటిని అవలంబించే ముందు నిపుణుల సలహాలు, సూచనల మేరకు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలి.