TS Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ కరెక్షన్ పూర్తైనట్లు సమాచారం. ఇక మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ తరుణంలో ఈనెల 20 తేదీ తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
పరిశీలన ప్రక్రియ పూర్తైన వెంటనే ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది విద్యార్థులు హాజర్యయారు. ఇక మార్చి 10వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు.
ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పరీక్ష ఫలితాలను అతి త్వరగా వెల్లడించాలని బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. జవాబు పత్రాల మూత్యాంకన ప్రక్రియ నాలుగు దశల్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఒక దశ మూల్యాంకనం పూర్తైంది. ఇక మిగతా మూడు దశల వాల్యుయేషన్ ప్రక్రియను బోర్డు ఈనెలాఖరులోపు పూర్తి చేయనుంది. ఇది పూర్తి చేయడానికి ఈనెల 20వ తేదీ వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఏపీ ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే.