TS : అప్రూవర్ గా మారిన ప్రభాకర్ రావు!.. ఇక ట్విస్టులే ట్విస్టులు

www.mannamweb.com


తెలంగాణలో (Telangana) ట్యాపింగ్ కేసు (Tapping Case) సంచలన మలుపు తిరగబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకర్ రావు లేదా మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ అప్రూవర్ గా మారి సంచనాత్మక విషయాలు బయటపెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు.
తన మెడకే కేసు చుట్టుకోవడంతో ప్రభాకరరావు తీవ్రంగా ఆందోళన చెదుతున్నారు.

ఆయన పోలీసు శాఖలోని తన సన్నిహితులతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తన రాజకీయ బాసులు చెబితేనే చేశానని అంగీకరించి.. జరిగిదంందా చెబితే.. అప్రూవర్ గా మార్చి బయటపడేస్తామన్న ఆఫర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆయన కన్విన్స్ కావడంతో ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్యాపింగ్ కేసు అత్యంత కఠిమైనది, ట్యాపింగ్ చేసినట్లుగా పక్కా ఆధారాలు ఉండటంతో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెడుతున్నారు. అయితే పోలీసులు ఈ ఒక్క అంశంపై దృష్టి పెట్టడం లేదు. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంలో ఓ మాఫియా మాదిరిగా వ్యాపారుల్ని దోచుకున్న వైనాన్ని బయటపెట్టాలనుకుంటున్నారు.

ప్రభాకర్ రావు.. అమెరికా నుంచి వచ్చి పోలీసుల ఎదుటలొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు లేదా మరో కీలక నిందితుడు అప్రూవర్ గా మారితే.. ఇక రాజకీయ నేతలకూ నోటీసులు వెళ్లనున్నాయి. ఇద్దరు మాజీ మంత్రులు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కేటీఆర్ పేరు తరచూ ప్రస్తావనకు వస్తోంది. ప్రభాకర్ రావును అరెస్టు చూపించిన తర్వాత ఈ ఇద్దరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. పొలిటికల్ గా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.