తిరుమల భక్తులకు అలర్ట్‌..అన్నప్రసాదాలపై టీటీడీ కీలక ప్రకటన

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. తిరుమల అన్నదాన ప్రసాదాల వితరణపై తాజాగా కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఆలయాలలో రుచికరమైన అన్న ప్రసాదాలు అందజేస్తామని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తాజాగా వెల్లడించారు. టీటీడీ అనుబంధంతో నడుస్తున్న ఆలయాలలో అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, తాజాగా జరిగిన సమీక్షలో అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు.


టీటీడీలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే, వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు అనిల్‌కుమార్‌ సింఘాల్‌. అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా వెల్లడించారు. ప్రస్తుతం టీటీడీ పాలక మండలికి సంబంధించిన 15 ఆలయాలలో అన్న ప్రసాదం అందిస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి మరో 19 ఆలయాలలో కూడా అన్న ప్రసాద వితరణ కూడా ప్రారంభించనున్నారు. మిగిలిన 26 ఆలయాలలో 2026 ఫిబ్రవరి 28 నుంచి అన్న ప్రసాదాల పంపిణీ ప్రారంభం కాబోతుందట. ఇటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న టీటీడీ ఆలయంలో కూడా అన్న ప్రసాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.