రఘురామకృష్ణరాజుపై కస్టడీలో హత్యాయత్నం చేసిన కేసులో తులసీబాబును పోలీసులు అరెస్టు చేశారు. మాములుగా అయితే ఆయనను ప్రశ్నించి పంపేసేవారేమో కానీ కొంత మందిని వేసుకొచ్చి పోలీసుల్నే బెదిరించారు.
దర్యాప్తు అధికారిని కూడా వీఆర్‌లోకి పంపుతా అని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. దీంతో చూసి చూసి పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేశారు.
కామేపల్లి తులసీబాబు గుడివాడ ఎమ్మెల్యేకు దగ్గర మనిషి అన్న ప్రచారం ఉంది. ఆయన గుడివాడకు చెందిన వ్యక్తి కాదు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. అటు విజయ్ పాల్‌కు ఇటు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు కూడా దగ్గర. ఈ తులసీబాబుతోనే రఘురామకృష్ణరాజును కొట్టించారు. ఫోన్ అన్‌లాక్ చేయమని ఒత్తిడి తెచ్చారు. ఆయన గుండెలపై కూర్చున్నారు. అసలు ఇలా పోలీసుల కస్టడీ రూంలోకి ఓ ప్రైవేటు వ్యక్తి రావడమే అరాచకమే అంటే.. చేయి చేసుకోవడం ఇంకా ఘోరం.
ఈ తులసీబాబుకు ఎంత అతి ఉంటే… విచారణ కోసం అనుచరుల పేరుతో కొంత మంది మూకను వేసుకుని వచ్చాడు. కార్లకు టీడీపీ, ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని వచ్చాడు. అసలు ఈయన టీడీపీనో కాదో ఎవరికీ తెలియదు. పసుపు చొక్కా కూడా వేసుకుని వచ్చాడు. పోలీసుల్ని బెదిరించడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు. చివరికి అరెస్టయ్యాడు. ఈయన చేసిన అతికి పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్ ఖాయమని జోకులు పేలుతున్నాయి.