AP: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు

ఏపీలో జరుగుతున్న కీడ్రా పోటీల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆటలాడుతూ గాయాలపాలయ్యారు. కబడ్డీ ఆడుతూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వెనక్కు పడిపోయారు.


దీంతో ఆయన తలకు పెద్ద గాయమైంది. అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూనే కింద పడిపోయారు. దీంతో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. మరోవైపు క్రికెట్ ఆడుతూ ఎమ్మెల్సీ రాంభూపాలరెడ్డి కింద పడిపోయారు. దీంతో ఆయనకు కూడా బాగా దెబ్బలు తగిలాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.