దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా గట్టి ప్లాన్స్‌తో వచ్చేసింది. తమ బ్రాండ్ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ కారు మోడళ్లను లాంచ్ చేసింది.
BE6, XEV9e పేరుతో వీటిని తీసుకువచ్చింది. వీటి బుకింగ్స్ ఫిబ్రవరి 14 2025 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త వాహనాలతో భారత ఈవీ మార్కెట్లో ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ కార్లు ఎప్పుడు వినియోగదారులకు డెలివరీ అవ్వనున్నాయి?. ఈ BE 6 కారు టాటా కర్వ్ ఈవీకి పోటీగా ఉండగా.. XEV9e కారు.. BYD Auto 3 సహా త్వరలో లాంచ్ కానున్న టాటా హరియర్ ఈవీకి పోటీ ఇవ్వనుంది.
ఈవీ సెగ్మెంట్లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు మహీంద్రా సంస్థ ఈ BE6, XEV9e కార్లలో టాప్ వేరియంట్లను మొదట డెలివరీ చేయనుంది. వీటి డెలివరీలు ఈ మార్చి మధ్యనాటికి ప్రారంభించే అవకాశం ఉంది. వీటి ఉత్పత్తి కోసం ఇప్పటికే 1,837 యూనిట్లను జనవరి నెలలో డీలర్స్ వద్దకు తరలించింది. వీటితో మార్కెట్లోకి స్ట్రాంగ్ లాంచ్ ఇవ్వాలని మహీంద్రా సంస్థ భావిస్తోంది.
ఇక వీటి ప్రొడక్షన్ నంబర్స్ విషయానికి వస్తే మహీంద్రా సంస్థ జనవరిలో 2,281 యూనిట్ల BE6, XEV 9e కార్లను ఉత్పత్తి చేసింది. CY2024 లో భారత్లోని ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో 98,841 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంటే సగటున 8,236 కార్ల విక్రయాలు జరిగాయి. మహీంద్రా సంస్థ టాప్ వేరియంట్‌ల డెలివరీని మొదలు పెడితే సేల్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
CY 2024లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో మహీంద్రా సంస్థ విక్రయాల పరంగా మూడో స్థానంలో నిలిచింది. అంతకుముందు ఇదే CY2024లో మహీంద్రా సంస్థ నుంచి XUV 400 ఎలక్ట్రిక్ కారు అమ్మకాలు.. 7,104 యూనిట్లుగా ఉన్నాయి. ఇప్పుడు తమ ఈవీ లైన్-అప్‌లో ఈ BE6, XEV9e కార్ల ప్రవేశంతో మార్కెట్లో మహీంద్రాస్థానం మరింత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రెండు BE6, XEV9e కార్లు INGLO ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మించారు అదేవిధంగా ఈ రెండింట్లో బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఒకే తరహాలో ఉంటాయి. BE6 కారు 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇక XEV9e కారు నాలుగు ఎడిషన్లలో ఉంటుంది. ఎడిషన్లను బట్టి వీడి డెలివరీ టైం వేరువేరుగా ఉంటుంది. ఈ రెండు మోడళ్లలోని టాప్ వేరియంట్లు 79kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటాయి.
ఈ వేరియంట్ కార్లు 59kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉండే మిగతా ఎడిషన్‌లతో పోలిస్తే ఎక్కువ పవర్ రేంజ్ అందిస్తాయి. ఈ కారులో రియర్ యాక్సిల్ పైన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 59 kwh వేరియంటల్‌లో 231 hp పవర్, 380 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 79 kwh వేరియంటల్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ 286 hp పవర్, 380 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ స్పెసిఫికేషన్లతో భారత మార్కెట్లో హై-పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈవీలను తయారు చేయాలన్న మహీంద్రా లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. ఈ రెండు మోడళ్లు చాలా మంచి ARAI సర్టిఫైడ్ రేంజ్ అందిస్తాయి. బీఈ6 కారు 556 km (59 kWh), 682 km (79 kWh) రేంజ్ అందిస్తుంది. XEV 9e కారు 542 km (59 kWh), 656 km (79 kWh) రేంజ్ అందిస్తుంది.
ఇక వీటి రియల్-వరల్డ్ రేంజ్ 500 కి.మీ.లకు పైగా ఉంటుందని మహీంద్రా సంస్థ చెబుతోంది. అలాగే ఈ రెండు మోడళ్లలోని టాప్ వేరియంట్లను ఇండియా NCAP క్రాష్ టెస్టులో పరీక్షించారు. వీటిలో మంచి ఫలితాలు దక్కించుకున్నాయి. దీంతో ఈ ఎలక్ట్రిక్ కార్లలో సేఫ్టీ విషయంలోనూ మహీంద్రా సంస్థ తగ్గేదేలా అంటున్నట్లుగా తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఎఫిషియన్సీ, సేఫ్టీపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఈ కొత్త మోడళ్లతో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి వస్తోంది మహీంద్రా సంస్థ. తమ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడమే కాకుండా.. ఈవీ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవాలని ఈ కంపెనీ భావిస్తోంది. వీటితో భారత ఈవీ ఇండస్ట్రీకి కొత్త కళ రాబోతుందని చెప్పవచ్చు.