తెలుగు రాష్ట్రాల్లో UIDAI ఆధార్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌ పాసైతే చాలు

సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్‌ సర్వీస్‌ ఇండియా లిమిటెడ్.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 282 ఆధార్‌ సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ జాల్లాల్లో భారీగా ఖాళీగా ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.

ఆధార్‌ సూపర్‌వైజర్‌/ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి పదో తరగతితోపాటు మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా లేదా ఇంటర్‌ లేదా పదో తరగతితోపాటు రెండేళ్ల ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధులకు ఆధార్‌ ఆపరేటర్‌ లేదా సూపర్‌వైజర్‌ సర్టిఫికెట్‌ కూడా తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్‌ బేసిక్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 ఏళ్లు, అంతకుపైన ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 31, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌ సూపర్‌ వైజర్‌ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించవల్సి ఉంటుంది. VLEs ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోండి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.