Itel color pro 5g: ఈ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 9,490కి లభిస్తోంది. ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో..
ఫోన్‌లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ కకెపాసిటీ గల బ్యాటరీని అందించారు. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ఆఫర్ లభిస్తోంది.
realme NARZO N61: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 8498కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇందులో 90 హెచ్‌జెడ్‌తో కూడిన ఐ కంఫర్ట్ డిస్‌ప్లేను అందించారు. ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్ సొంతం. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
Redmi 13C 5G: రూ. 10 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ ఫోన్ ఇది. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 8,999కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందింఆచరు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్‌ను అందించారు.
Samsung Galaxy M05: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 9,999కాగా అమెజాన్‌లో రూ. 7999కి లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించార. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 25 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
TECNO POP 9 5G: ఈ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,499కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 48 ఎంపీతో కూడని సోనీ ఏఐ కెమెరాను అందించారు. 5జీ సపోర్ట్ చేసే ఈ ఫోన్ NFCకి సపోర్ చేస్తుంది. అలాగే ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లను అందించారు.