దేశీయ టెలికాం రంగంలో జియో నంబర్ స్థానంలో దూసుకుపోతుంది. రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు పెంచినప్పటికీ బీఎస్‌ఎన్ఎల్, విఐ, ఎయిర్‌టెల్‌లకు పోటీనిస్తూ కస్టమర్లను తనవైపు తిప్పుకుంటుంది.
క్వాలిటీ నెట్‌వర్క్, వేగవంతమైన డేటా, అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌తో ప్రతి ఒక్కరికీ చేరువైంది. ఈ క్రమవంలోనే జియో తన యూజర్ల కోసం రూ.75 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
జియో రూ. 75 ప్లాన్
జియో ఈ రూ.75 ప్లాన్ జియో ఫోన్‌కి సంబంధించినది. దీని వాలిడిటీ 23 రోజులు, ఈ ప్లాన్‌లో రోజుకు 100MB డేటా లభిస్తుంది. ఇది మొత్తం 23 రోజులకు 2.5GB డేటాతో సమానం. డేటా లిమిట్‌కు చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కెబిబిఎస్‌లకు తగ్గుతుంది. ఇది కాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, 50 SMS ఎస్‌ఎమ్‌ఎస్‌లు ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లో బోనస్‌గా 200 MB డేటా లభిస్తుంది.
జియో రూ. 75 ప్లాన్‌ని రీఛార్జ్ చేయడం చాలా సులభం. మీరు దీన్ని Jio అధికారిక వెబ్‌సైట్ లేదా My Jio యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో పాటు మీరు Google Pay, PhonePe వంటి అనేక థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనంగా ఈ ప్లాన్ JioTV, JioCinema, JioCloud, JioSecurity వంటి ఫీచర్లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.
ఇది రూ. 75కి చాలా ఉపయోగంగా ఉంటుంది. అయితే ఈ ప్లాన్ కేవలం JioPhone వినియోగదారులకు మాత్రమే. కొంచెం ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి జియో రూ. 125 ప్లాన్ మరొక ఎంపిక. ఈ ప్లాన్ కూడా 23 రోజుల వాలిడిటీతో వస్తుంది. అయితే ఇది రోజుకు 500MB డేటాను అందిస్తుంది. అలానే జియోలో మరెన్నో ఇతర రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ ఎంచుకోండి.