UPSC Jobs 2024 : యూపీఎస్సీలో 122 పోస్టులకు ఉద్యోగాలు..అప్లయ్ చేశారా..?

www.mannamweb.com


యూనియన్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొత్తం 122 పోస్టులకు సంబంధించి జాబ్​ నోటిఫికేషన్​ విడుదల చేశారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోగలరు. పోస్టుల ఆధారంగా విద్యార్హతలను నిర్దేశించడం జరిగింది. సంబంధిత సబ్జెక్ట్​లో పీజీలో ఉత్తీర్ణత సాధించి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం ఖాళీలు : 122 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్- 51

సైంటిస్ట్​-బీ

ఫిజికల్​-సివిల్​- 01

జూలాజికల్​ సర్వే- 09

ఎన్వీరాన్​మెంటల్​ సైన్స్​- 02

ఇంజీనీర్​ అండ్​ షిప్​ సర్వేయర్- 01

స్పెషలిస్ట్​ (గ్రేడ్​-III)

యూరాలజీ- 02

న్యూరో-సర్జరీ- 06

ఆప్తాల్​మాలజీ- 17

ఆర్థోపెడిక్స్- 19

ఈన్​టీ- 09

ట్యూబర్​కులోసిస్​, రెస్పిరేటరీ మెడిసిన్​ పల్మనరీ- 02

అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్ ​(గ్రేడ్-I)- 02

ఫీజు వివరాలు..

ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునేవారికి రూ. 25 ను అప్లికేషన్ ఫీజుగా పరిగణించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం 25 రూపాయలను అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 10, 2024

దరఖాస్తుకు ఆఖరు తేదీ : ఫిబ్రవరి 29, 2024

ఆన్​లైన్​లో దరఖాస్తు ప్రింట్​అవుట్​కు గడువు- మార్చి 1, 2024

వయసు

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారికి వయోపరిమితులను పరిగణించారు. ఆయా పోస్టులను అనుసరించి కేటగిరీల వారిగా వయోపరిమితులను నిర్ణయించారు. గరిష్ఠంగా 35 నుంచి 50 ఏళ్లు (2024 ఫిబ్రవరి 29 నాటికి) ఉన్నవారు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్ https://upsc.gov.in/ లేదా upsconline.nic.in ను సంప్రదించవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు చేసుకునే విధానం..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ అఫీషియల్​ వెబ్​సైట్​ upsconline.nic.in లోకి వెళ్లి లాగిన్​ అవ్వాలి. అనంతరం హోంపేజ్​పై కనిపించే ‘ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS’ లింక్​పై క్లిక్​ చేయాల్సి ఉంటుంది. డీటేల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్​ వివరాలతో అప్లికేషన్​ ప్రాసెస్​ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించి అప్లయ్ ఫారాన్ని సబ్మిట్​ చేయగలరు.