Uric Acid: యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువగా ఉంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండండి. వాటిని మీ ఆహారంలో చేర్చుకోవద్దు. ఎందుకంటే ఈ ఆహారాల్లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది.
ఈ కారణంగా యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది..
మన మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసినప్పటికీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది సరిగ్గా ఫిల్టర్ చేయదు. దీనికి మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా పప్పులను జాగ్రత్తగా తీసుకోవాలి. వాస్తవానికి, చాలా పప్పులలో ప్రోటీన్ ,ప్యూరిన్ ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ రోగులకు విషంతో సమానం.
శనగ పప్పు: యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారు శనగ పప్పు తినకూడదు. ఇందులో ఉండే జింక్, క్యాల్షియం, ప్రొటీన్లు శరీరంలోని బలహీనతను తొలగించి ఎముకలను దృఢంగా మారుస్తాయి. కానీ మీరు యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నట్లయితే ఈ శనగపప్పు మీకు విషం లాంటిది. వెంటనే తినడం ఆపేయండి.
నల్ల మినుములు: నల్లమినపప్పులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, విటమిన్ బి-6, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన గుండె ,నాడీ వ్యవస్థకు మంచిది. ఒకవేళ మీరు యూరిక్ యాసిడ్ రోగులు అయితే ఈ పప్పు తినకూడదు. ఇందులో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
రాజ్మా: మినపప్పు మాదిరి రాజ్మాలో కూడా ప్యూరిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ రోగులకు చాలా హానికరం. సాధారణంగా రాజ్మా ను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా తింటారు. ఇక్కడ కూడా రాజ్మా తినేవాళ్లు ఉన్నారు. మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా రాజ్మా తినకండి.
మైసూర్ పప్పు: మైసూర్ పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పప్పుతో బరువు సులభంగా తగ్గిపోతారు. యూరిక్ యాసిడ్ తో బాధపడుతుంటే పొరపాటున కూడా ఈ పప్పు తినకండి. ఇందులో అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. యూరిక్ యాసిడ్ రోగులకు హానికరం. (Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Mannam Web ధృవీకరించలేదు.)