ఇది వాడండి… షుగరు టాబ్లెట్లు విసిరికొట్టండి

షుగరు అనేది ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాపిస్తోంది. పుట్టుకతోనే కొందరికి షుగర ఉంటోందంటే అర్థం చేసుకోండి దాని ప్రభావం ఎంతగా విస్తరిస్తుందో అని.


జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కొన్నిసార్లు ప్రీ-డయాబెటిస్ దశలో లేదా డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. అయితే ఇప్పటికే మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా లేకుండా ఆపడం చాలా ప్రమాదకరం.

షుగర్ నియంత్రణకు సహజ పద్ధతులు

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెరలకు దూరంగా ఉండాలి. తెల్ల పిండి (మైదా) ఉత్పత్తులు, కేకులు, పేస్ట్రీలు, చక్కెర అధికంగా ఉండే పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించుకోవాలి. బ్రౌన్ రైస్, బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాలు, ఆకుకూరలు (పాలకూర, బచ్చలికూర), కూరగాయలు, పండ్లు (తక్కువ చక్కెర ఉన్నవి) ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెరిగేలా చేస్తాయి. చర్మం లేని పౌల్ట్రీ, చేపలు, టోఫు, చిక్కుళ్ళు, బీన్స్, కాయధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు తీసుకోవాలి. కెనోలా ఆయిల్, ఆలివ్ నూనె, అవకాడోలు వంటి మొక్కల ఆధారిత నూనెలు ఉపయోగించాలి.

పండ్లు నేరుగా తినాలి

పండ్ల రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది. వెల్లుల్లి బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.రాత్రిపూట నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ను అల్లం తగ్గిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి బ్లడ్ షుగర్‌ను నియంత్రిస్తుంది. శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యం.

పరగడుపునే ఇది చేయండి..

వీటన్నింటికన్నా ప్రధానమైంది.. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున కొన్ని మెంతి గింజలు తీసుకొని నోట్లో వేసుకోవాలి. వెంటనే పులుపు లేని మజ్జిగను తాగాలి. అవసరమైతే రాత్రి కొంచెం పెరుగు తోడుబెట్టుకొని దాన్ని పొద్దున్నే మజ్జిగలా చేసుకొని మెంతి గింజలు మింగగానే దాన్ని తాగాలి. ఇది చాలా మంచిదని, మెంతి గింజలు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడంకన్నా ఇది మంచి పద్ధతని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీంతో షుగరు టాబ్లెట్లు అవసరమే రాదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.