మల్టిపుల్ అకౌంట్స్ వాడుతున్నారా? సెట్టింగ్స్ అన్నీ ఒకేచోట మార్చుకోవచ్చు

సోషల్ మీడియాలో అకౌంట్ సెట్టింగ్స్ మార్చాలన్నా లేదా ప్రైవసీ ఆప్షన్స్‌ అప్‌డేట్ చేయాలన్నా.. ఒక్కో యాప్‌లో ఒక్కోరకమైన సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అయితే ఆ ఇబ్బంది లేకుండా మెటా ‘అకౌంట్ సెంటర్’ ద్వారా అన్ని సోషల్ మీడియా సెట్టింగ్స్‌ను ఒకేచోట మార్చుకోవచ్చని మీకు తెలుసా. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది యూజర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ వంటి ప్లాట్ ఫామ్స్ అన్నింటికీ ‘మెటా’నే పేరెంట్ కంపెనీ. కాబట్టి మీరు అకౌంట్స్ కు సంబంధించిన సెట్టింగ్స్ అన్నింటినీ ఒకేచోట మార్చుకోవచ్చు. అదెలాగంటే..


మెటా అకౌంట్ సెంటర్

మెటాకు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ సెట్టింగ్స్ అన్నింటినీ ఒకేచోట మార్చుకునేందుకు ముందుగా మెటా అకౌంట్‌ సెంటర్‌లోకి వెళ్లాలి. మెటా వెబ్ సైట్ లోకి వెళ్లి మీకు ఆల్రెడీ ఉన్న ఇన్ స్టాగ్రామ్ లేదా ఫేస్ బుక్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వాలి. అప్పుడు మెటా అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత అందులోకి లాగిన్ అయ్యి అక్కడ ప్రొఫైల్ పై క్లిక్ చేసి అకౌంట్ సెంటర్ కు వెళ్లాలి. ఇక్కడ మెటాకు లింక్ అయ్యి ఉన్న అకౌంట్స్ అన్ని కనిపిస్తాయి. కనిపించకపోతే  యాడ్ అకౌంట్స్ పై క్లిక్ చేసి  సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఈ అకౌంట్ సెంటర్‌కు లింక్ చేస్తే చాలు. ఎప్పుడు, ఎలాంటి మార్పులు చేయాలన్నా ఈ సెంటర్‌‌లో లాగిన్ అయ్యి, ఇక్కడ్నుంచే మీ సెట్టింగ్స్ అన్నీ మార్చుకోవచ్చు.

మల్టిపుల్ అకౌంట్స్

ఒకటి కన్నా ఎక్కువ సోషల్ మీడియా అకౌంట్లు వాడేవాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండు మూడు ఫేస్ బుక్ ప్రొఫైల్స్ లేదా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నవాళ్లు పర్సనల్ ఇన్ఫర్మేషన్, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ ఆప్షన్లు, ప్రైవసీ ఆప్షన్ల  వంటివన్నింటినీ మెటా అకౌంట్ సెంటర్‌‌లోనే మార్చుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకుంటే అవి ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, మెసెంజర్.. అన్నింటకీ అప్లై అవుతాయి.సోషల్ మీడియాల్లో వచ్చే యాడ్ టాపిక్‌లు, యాడ్ ప్రిఫరెన్స్‌లు కూడా అకౌంట్ సెంటర్‌‌లోనే సెట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ సెంటర్ లో 25 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల వరకూ యాడ్ చేసుకునే వీలుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.