Vande Bharat: వందేభారత్‌ రైళ్లలో భోజనం.. రైల్వే కీలక ప్రకటన

వందే భారత్ రైళ్లలో ప్రయాణీకులకు రైల్వే శాఖ ఇటీవల మరో సౌకర్యాన్ని కల్పించింది. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకోని వారికి కూడా ప్రయాణ సమయంలో అక్కడికక్కడే ఆహారాన్ని అందించాలని IRCTC నిర్ణయించింది. ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే, ప్రయాణీకులకు వాటిని అక్కడికక్కడే కొనుగోలు చేసే అవకాశం ఇవ్వబడుతుంది.


టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ‘ఫుడ్ ఆప్షన్’ ఎంచుకున్న వారికి మాత్రమే IRCTC ప్రస్తుతం ఈ సేవలను అందిస్తోంది. ప్రయాణ సమయంలో ఆహార వసతి ఏర్పాటుకు సంబంధించి ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన తర్వాత IRCTC మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం (ఫిబ్రవరి 7)న భారత రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.