కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త సంవత్సరం తమకు ఐశ్వర్యం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు.
కొత్త సంవత్సరంలో ఆనందం , సంపద రాక కోసం జ్యోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో ప్రత్యేక చిట్కాలు ఇవ్వబడ్డాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని మొక్కలను ఇంటికి తీసుకురావడం వల్ల సంవత్సరం మొత్తం సిరి సంపదలతో నిండి ఉంటుందని చెబుతారు. అలాగే ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో ఏయే మొక్కలు నాటితే శుభం కలుగుతుందో తెలుసుకుందాం.
తులసి మొక్క: తులసి మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. పూజిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల సంవత్సరం మొత్తం చాలా శుభప్రదమని చెబుతారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. సిరి సంపదలకు లోటు ఉండదు.
జమ్మి మొక్క: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో జమ్మి మొక్క పెంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో జమ్మి మొక్కను నాటడం ద్వారా శివుడు, శనిదేవుని అనుగ్రహం ఉంటుందని హిందూ మత విశ్వాసం. అలాగే శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరం ప్రారంభంలో మీ ఇంట్లో జమ్మి మొక్కను పెంచుకోవచ్చు. ఈ మొక్క ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
మనీ ప్లాంట్: వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ ఆనందం, శ్రేయస్సు కు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మనీ ప్లాంట్ను ఎల్లప్పుడూ ఇంటి ఆగ్నేయ మూలలో పెంచుకోవాలి. ఇంటి ఆర్థిక పురోగతికి మనీ ప్లాంట్ కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
జిల్లేడు మొక్క : వాస్తు శాస్త్రం ప్రకారం శ్వేతార్క మొక్క అంటే జిల్లేడు మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా పరిగణింపబడుతున్నది. ఈ మొక్క గణపతికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం వలన సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయని.. అలాగే నెగటివ్ ఎనర్జీ నశింపజేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుందని చెబుతారు. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరంలో ఇంట్లో ప్రతికూల శక్తిని తొలిగించుకోవడానికి జిల్లేడు మొక్కను పెంచుకోండి.
క్రాసుల మొక్క: వాస్తు శాస్త్రం ప్రకారం జడే మొక్కను పెంచుకోవడం శుభ ప్రదం అని.. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని తెలుస్తోంది. ఈ మొక్క ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో జాడే మొక్కను నాటడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొంది పురోభివృద్ధి పొందుతారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరంలో ఇంట్లో ఈ మొక్కను నాటవచ్చు.