ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. అదృష్టం మీదే

www.mannamweb.com


వాస్తు శాస్త్రం అనేది కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాదు ఇంట్లోని అన్ని వస్తువులతో ముడి పడి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను మీ ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు, ఇంటి గొడవలు, కుటుంబ సభ్యుల తగాదాలు దూరమవుతాయని, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అవుతుందని వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా ఇంటి సభ్యులకు అదృష్టం కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఆ వస్తువులు ఏంటి? ఇప్పుడు తెలుసుకోండి.

లాఫింగ్ బుద్ధ:

లాఫింగ్ బుద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి అందరికీ తెలుసు. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని, ధనం ప్రవాహం కూడా కలుగుతుందని జనాలు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఇంట్లో ఖచ్చితంగా లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటారు. గిఫ్టుల రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉత్తర దిక్కున హాల్‌లో పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సంపద కూడా పెరుగుతుంది.

ఈవిల్ ఐ లాకెట్స్:

ఈ మధ్య కాలంలో ఈవిల్ ఐ లాకెట్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. వీటిని కూడా గిప్టులుగా ఇస్తున్నారు. వీటిని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొటుంది. వీటిని ఎక్కువగా ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాల ప్రజలు వాడతారు. వీటి వలన దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది.

తాబేలు:

తాబేలును ఇంట్లో పెంచుకున్న వాటికి సంబంధించిన బొమ్మలు పెట్టుకున్నా మంచిదని నమ్ముతారు. వీటిని ఇంట్లో తూర్పు దిక్కులో పెట్టుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొని, సంపద పెరుగుతుందని విశ్వసిస్తారు.

ఏనుగు విగ్రహాలు:

పంచ లోహాలతో చేసిన ఏనుగు విగ్రహాలు కానీ, వెండితో చేసిన విగ్రహాలు కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి.. సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఏనుగు విగ్రహాలను ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)