Vastu Tips : జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా.. అనేక అడ్డంకులు వస్తాయి. ఈ అడ్డంకులు రావడానికి కారణమేంటి?
అనేది తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే అంతకంటే ముందుగానే సమస్య పరిష్కారం కోసం కొన్ని పనులు చేయాలి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నంతసేపు ఏ పని చేసినా సాధ్యం కాదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఎప్పడూ ఎదో ఒక సమస్యతో ఆందోళనతో ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ బొమ్మను ఉంచితే అనుకున్న పనులు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంతకీ ఆ బొమ్మ ఏదంటే?
సర్వ జగత్తుకు వెలుగునిచ్చేది సూర్యుడు. సూర్యదేవుడు లేకపోతే జీవన మనుగడ సాధ్యం కాదు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో సూర్యుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే సూర్యుడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు తూర్పు వైపు ఉండి.. ఉదయం సూర్యుడి కిరణాలు ఇంట్లో పడినట్లయితే అప్పుడు ఇంట్లో ఏడు గుర్రాల బొమ్మను ఉంచాలి. సూర్యుడి వాహనమైన ఈ బొమ్మను ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆ ఇంట్లో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.
వెలుగుతో పాటు వేడిని అందించే శక్తి సూర్యుడికి మాత్రమే ఉంది. రాగితో కూడిన సూర్యుడి ప్రతిమను తూర్పు వైపు కనిపించేలా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధాలు బాగుంటాయి. ఒకరికొకరు గౌరవం ఇస్తూ ఆనందంగా ఉంటారు. కొందరి ఇళ్లల్లో పిల్లలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. ఎన్ని మందులు వాడినా నయం కాని వారు ఉంటారు. అయితే వారి గదిలో సూర్యుడి విగ్రహం ఉంచడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంట్లో గృహిణి ఆనందంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది. గృహిణి ఎక్కువ సేపు వంటగదిలో ఉంటుంది. అందువల్ల వంటగదిలో కూడా రాగితో ఉన్న సూర్యుడి ప్రతిమ ఉంచడం వల్ల ఇంట్లో వాళ్లంతా ఆరోగ్యంగా ఉంటారు. వారికి అకారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దేవుడి గదిలో కూడా రాగితో కూడిని సూర్యుడి ప్రతిమను ఉంచవచ్చు. అయితే సూర్యోదయం సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుంది.