Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం ఎవరికి ఏ దిక్కున ఉండాలి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సరైన దిక్కున లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు. ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇవి సానుకూల శక్తిని విడుదల చేస్తుంది.


ముందు తలుపు నుంచి వెలువడే శక్తి మొత్తం భవనం మీద పడుతుంది. అందుకే వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం పెడతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం సృష్టించడంలో ప్రధాన ద్వారం కీలక పాత్ర పోషిస్తుంది. ఏయే రాశుల వారికి ఏ విధంగా ఇంటి ప్రధాన ద్వారం ఉంటే కలిసి వస్తుందో తెలుసుకుందాం.

ఇల్లు అందంగా నిర్మించుకోవాలని.. . ప్రతి ఒక్కరి కల .. ఒక సొంత ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతాడు. ఇంటికి ప్రధాన ప్రవేశ ద్వారం అనేది చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇల్లు లేకపోతే అనేక అనర్థాలు ఎదురవుతాయి. ఇంటి ప్రవేశ ద్వారం నుంచే శక్తులు ఇంట్లోకి వెళ్ళడానికి, బయటకి పోవడానికి ఉంటుంది. ఇంట్లో శ్రేయస్సు, కుటుంబం బాగుండాలంటే ప్రధాన ద్వారం సరైన దిశలో ఉండాలి.

ఏ రాశి వారికి ఏ దిక్కు ప్రవేశ ద్వారం మంచిదంటే…

మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశ ఉత్తమమైనది.
వృషభం, తుల, మకర రాశుల వారికి దక్షిణ ద్వారం మంచిది.
మిథునం, కన్య, కుంభ రాశులకు పశ్చిమ ద్వారం మంచిది.
కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వారికి ఉత్తర ద్వారం మేలు చేస్తుంది.
ఒకవేళ రాశికి అనుగుణంగా ద్వారం ఏర్పాటు చేయలేకపోతే ఆ దిశలో కనీసం కిటికీ పెట్టినా శుభప్రదంగానే ఉంటుంది.
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి కోరకు మీ పేరు (వ్యవహారనామం)లోని మొదటి అక్షరముతో మీరు ఉండే ఇల్లు ప్రధాన ద్వారం ఎంత వరకు మీకు అనుకూలమో చూసుకోండి. మీ గృహానికి సింహద్వారాన్ని ఎంచుకోవాలి అంటే మిమ్మల్ని అందరు ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరులోని మొదటి అక్షరాన్ని తీసుకుని క్రింద తెలిపిన పట్టిక వర్గులలో మీ పేరుకు ఏ దిశ అనుకూలంమో చూసుకుని గృహ నిర్మాణం కాని,అద్దెకు ఉండడానికైన సరే మీ ఇంటి యజమాని పేరు మొదటి అక్షరం సహాయంతో నిర్ణయం తీసుకోవాలి. జాతక జన్మనక్షత్ర ఆధారంగా వచ్చిన జన్మనామము ఇంటి సింహద్వారం నిర్ణయానికి పనికిరాదు. గృహానికి దిశను సరిగ్గా గుర్తించే కంపాస్ సహాయంతో దిక్కులను గుర్తించి సరిపోయే గృహ ప్రధాన ద్వారాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

అ నుండి అం,ఆ: వరకు (ఆ-వర్గు) తూర్పు, పడమర, దక్షిణం దిశ ద్వారములు అనుకూలం.
క ,ఖ,గ,ఘ,ఙ (క -వర్గు)దక్షిణం,పడమర దిశ సరిపోయే సింహద్వారము.
చ,ఛ,జ,ఝ,ఇ+(ఛ-వర్గు)తూర్పు, ఉత్తరం, పడమర దిశ సరిపోయే సింహద్వారాలు.
ట,ఠ,డ,ఢ,ణ (ట-వర్గు) తూర్పు, ఉత్తరం, పడమర దిశ సరిపోయే సింహద్వారాలు.
త,ద,ధ,న (త-వర్గు)తూర్పు, ఉత్తరం దిశ సరిపోయే సింహద్వారములు.
ప,ఫ,బ,భ,మ (ప-వర్గు) తూర్పు, ఉత్తరము దిశ సరిపోయే సింహద్వారములు
య,ర,ల,వ (య-వర్గు) తూర్పు, పడమర, దక్షిణం దిశ సరిపోయే సింహద్వారములు.
శ.ష,స,హ (శ-వర్గు) దక్షిణం,తూర్పు దిశ సరిపడే సింహద్వారములు.
ఇంటి ప్రధాన ద్వారం వాస్తు శాస్త్రం ప్రకారం ఉండటం వల్ల మీకు సంపద, ఆనందాన్ని ఇస్తుంది. మెయిన్ డోర్ కి ఎప్పుడు నలుపు రంగు తలుపు పెట్టకూడదు. అది ఇంటికి అరిష్టంగా భావిస్తారు. అందుకే ఎక్కువ మంది దేవతామూర్తులు ఉన్న వాటితో డిజైన్ చేయించి పెట్టుకుంటారు. ఇంటి ప్రవేశ ద్వారం ఈశాన్య దిశగా ఉండటం వల్ల సూర్యుని కాంతి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి.
వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికైనా సరిపోతాయి. కానీ దక్షిణ, పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాశులకి తప్ప వేరొకరికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. ఉత్తర దిశలో ప్రధాన ద్వారం ఉంటే సంపద, అదృష్టం కలుగుతుంది. తూర్పున ఉంటే ఇంట్లోకి శక్తి, ఆనందం వస్తుంది. కొన్ని రాశుల వారికి ప్రధాన ద్వారం పశ్చిమ, వాయువ్య దిశలు శుభప్రదంగా పరిగణిస్తారు.
ఇతర తలుపులతో పోలిస్తే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసే తలుపు పరిమాణం పెద్దదిగా ఉండాలి. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద బేసి సంఖ్యలోనే మెట్లు ఏర్పాటు చేయాలి. అలా చేయడం వల్ల ఇంటిని హానికరమైన ప్రభావాల నుంచి కాపాడుతుంది.
పడమర నైరుతిలో డోర్ ఉంటే ఇబ్బందులు వస్తాయి . పడమర వాయువ్యంలో ఉండటం తప్పు కాదు. అయితే ఇంట్లోకి గాలి, వెలుతురు ఎలా వస్తున్నాయో, చూసుకుని దానికి అనుకూలంగా కిటికీలు అమర్చుకోవాలి
ఆస్తి పంపకాల్లో అయినా సరే పెద్దవాడు ఎప్పుడూ పడమర ఉండాలి. చిన్నవాడు కింద తూర్పు వైపు ఉండాలి. మీరు దానికి విరుద్ధంగా ఆస్తి పంపకాలు చేసుకున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఇద్దరికీ ఆర్థికంగా ఎదుగుదల ఉండదు. ఇద్దరూ మారడం మంచిది. దక్షిణం వైపు దారి వదులుకోవడం కూడా మంచిది కాదు. ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంటే, అటువైపు దారి పెట్టుకోండి. కొంత వరకు మేలు జరగొచ్చు.
ప్రవేశ ద్వారం పగిలినా లేదంటే విరిగినా వెంటనే కొత్తది పెట్టించుకోవడం మంచిది. వాస్తు ప్రకారం తలుపు అలా ఉంటే దోషం అంటారు. ఇంటి కుటుంబ సభ్యుల శ్రేయస్సుని ప్రభావితం చేస్తుంది. సంపద మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సరైన కాంతి ఉండే విధంగా చూసుకోవాలి.