సిద్దిపేట : ఎన్నికల కోడ్ ఉల్లగిస్తూ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు 38 మంది సెర్ప్ ఉద్యోగుల్లో 14 ఎపీఎంలు, 18 మంది సీసీలు, 4 గురు వీవోలు, ఒక్కరు సీఓ, ఒక్కరు సీబీ ఆడిటర్స్, అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగుల్లో 4 మంది ఏపీఎంలు, 7 ఈసీలు, 38 మంది టీఏలు, 18 మంది సీఓలు, ఒక్కరు ఎఫ్ ఎ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ మంగళవారం మిక్కిలినేని మనుచౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట పట్టణంలోని రెడ్డి పంక్షన్ హాల్‌లో అదివారం రాత్రి బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులతో సమావేశం అయ్యాడన్న సమాచారం మేరకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అక్కడి వెళ్లి గేట్లకు తాళం వేసి ఆందోళన చేశారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని సదరు ఫంక్షన్ హాల్‌లో సీసీ పుటేజ్ ను ఎలక్షన్ కమిషన్, పోలీస్ అధికారులు సేకరించారు. పంక్షన్ హాల్‌లోని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇంచార్జి పృథ్వి ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి లపై కేసు నమోదైన విషయం తెలిసిదే.