వీడియో: హైదరాబాద్ లో దారుణం.. బైక్ రెండు కిలోమీటర్లు ఈడ్చెకెళ్లాడు!

www.mannamweb.com


ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు.
కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ లారీ బైక్ ని ఊడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పాతబస్తీలో ఓ భయానక ఘటన అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. ఓ బైక్ ని రెండు కిలోమీటర్లు వరకు లారీ డ్రైవర్ ఈడ్చుకువెళ్లడం చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదాచారులు భీతిల్లిపోయారు. ముందు వెళ్తున్న బైక్ ని లారీ డ్రైవర్ ఢీ కొట్టాడు. దీంతో లారీ డ్రైవర్ తో బైకర్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే లారీ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయిది. అవేవీ పట్టించుకోకుండా లారీ డ్రైవర్ బైక్ ని అలాగే ముందుకు తీసుకువెళ్లాడు. బైకర్ లారీ బ్యానెట్ పైనే నిలబడి ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా బైక్ ని రెండు కిలోమీటర్ల వరకు ఈడ్చుకు వెళ్లాడు. ఈ ఘటనను అటుగా వస్తున్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న మిగతా వాహనదారులు లారీని ఆపాలని సూచించినా.. డ్రైవర్ మరింత వేగంగా నడిపాడు. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో అప్పుడు లారీని ఆపాడు. వెంటనే బైకర్ కిందికి దిగిపోయాడు. ఈ ఘటనలో బైకర్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి డ్రైవర్లకు కఠినమైన శిక్ష విధించాలని.. మనుషు ప్రాణాలతో చెలగాటమాడే డ్రైవర్లకు లైసెన్స్ రద్దు చేసి జీవితంలో డ్రైవింగ్ చేయకుండా చేయాలని వాహనదారులు, నెటిజన్లు కోరుతున్నారు. మొత్తానికి వీడియో ఆధారంగా పోలీసులు ఆ లారీ డ్రైవర్ ని పట్టుకున్నారు.