రేవంత్ రెడ్డి(Revanth Reddy) అభిప్రాయాన్ని బీజేపీ(BJP) ఆలోచన చేస్తే మంచిదని సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి(Congress leader) అన్నారు.
గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను(Padma Awards) ప్రకటించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం(Telangana Governments) సిఫారసు చేసిన వారికి కేంద్రం మొండి చేయి చూపింది. దీనిపై తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు(Congress Leaders) అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి బిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పద్మ అవార్డులపై అసంతృప్తి వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా ఆమె.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డ్‌లల్లో తెలంగాణకు కనీసం 4 పద్మ అవార్డులు ఐనా వచ్చి ఉండాలి.. అనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం పరిశీలనాత్మకమని అన్నారు. అలాగే ఈ అంశంపై తప్పక తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలున్న బీజేపీ కూడా కొంత ఆలోచన చేస్తే మంచిదని కాంగ్రెస్ నేత సూచించారు