New traffic rules: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వేలల్లో జరిమానాలు విధిస్తారు

మైనర్లు బైక్‌ను రాష్‌గా డ్రైవ్ చేసినా, తాగి వాహనం నడిపినా, రాష్ డ్రైవింగ్, సిగ్నల్స్ క్రాస్ చేసినా.. ఇలా ఏదైనా సరే ఇక నుంచి వేల రూపాయలు కట్టాల్సిందేని ప్రభుత్వం చెబుతోంది.


ఇలాంటివారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టాలనే ఈ కఠినమైన నిర్ణయాలను అమలు చేసి తీరతామని అంటోంది.

హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతారు, మైనర్లు చాలా రాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తారు, కొంతమందైతే గ్రీన్ సిగ్నల్ పడకపోయినా వెళ్లిపోతారు. ఇలాంటివారంతా ఇప్పుడు వేల రూపాయలు జేబులో పెట్టుకుని ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా రూల్స్ ని అతిక్రమించేవారికి భారీగా జరిమానాలు విధించాలనే కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది.

తాగి డ్రైవ్ చేస్తే 10వేలు, మైనర్ బైక్ నడిపితే 25వేలు, ట్రాఫిక్ కి చెందిన ఏ రూల్ అతికమించినా వేలల్లో ఇక జరిమానాలు ఉండబోతున్నాయి. మనదేశంలో నిర్లక్ష్యం వల్ల ఏటా ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలమంది ఈ ప్రమాదాల్లో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ని అమలుచేయాలని నిర్ణయించింది. అన్ని చలానాలు వేల రూపాయల్లోనే ఉన్నాయి. దీనివల్ల కొంతైనా ప్రమాదాలను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.

ఇంతకుముందు చలానాలు కట్టకపోతే వాటికి పొలీసులు సబ్సిడీ ఇచ్చేవారు. ఉదాహరణకు 5వేల రూపాయలు జరిమానా పెండింగ్ ఉంటే 1000 లేదా 1200 కట్టించుకునేవారు. ఈ సబ్సిడీలు ఇచ్చిన సమయంలోనే చాలామంది చలానాలు కట్టేవారు. కానీ ఇక నుంచి ఈ వెసులబాటు ఉండదని కూడా తెలుస్తోంది. అందుకే ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే జేబులు కాళీ అయ్యే పరిస్థితి రాదు కదా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.