Viral video: ఇదేం చాటింపురా నాయనా..! పెళ్లిసంబంధం వస్తోందని చెప్పి.. ఎలాంటి షరతు పెట్టాడంటే..

పెళ్లిళ్లలో కొందరు, పెళ్లి ప్రయత్నాలు చేస్తూ మరికొందరు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది లైక్‌లు, వ్యూస్ కోసం ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం.


ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తనకు పెళ్లి సంబంధం వస్తోందని ఊర్లో చాటింపు వేశాడు. అలాగే అతను కొన్ని షరతులు కూడా విధించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ”ఇదెక్కడి చాటింపురా నాయనా”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడికి పెళ్లి సంబంధం వస్తోందని తెలిసింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఆ తర్వాత అతడు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. తనకు పెళ్లి సంబంధం వస్తోందంటూ స్నేహితుడితో కలిసి స్కూటీలో తిరుగుతూ పాత మైకు పట్టుకుని గ్రామంలో చాటింపు వేశాడు.

”రేపు నన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు.. అయితే అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నా.. ఎవరైనా నాకు బీడీలు, మందు తాగే అలవాటు ఉందని, ఇంట్లో గొడవలు చేస్తుంటాడని.. పెళ్లి వారికి చెబితే మీ ఇంటికి వచ్చి నా చేతిలో ఉన్న కర్రతో కొడతా”.. అంటూ హెచ్చరిస్తూ ఊరంగా తిరుగుతూ చాటింపు చేశాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ”ఇదెక్కడి చాటింపురా నాయానా”.., ”ఇతడి ముందు చూపు ఎంతో బాగుంది”.., ”దాదాగిరి బాగుంది”.., ”చట్టపరమైన హెచ్చరిక”.., ”ఇతడి కష్టం పగవాడికి కూడా రావొద్దు”.., అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.