Viral News : ఊరంతా అందగత్తెలే.. వివాహం మాత్రం కావడం లేదు.. పెళ్ళికాని ప్రసాద్ లు ట్రై చేస్తారా?

ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం, పెళ్లి చేసుకునేందుకు యువతులు అంత తొందరగా ఓకే చెప్పకపోవడం, చదువు, కెరియర్, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం.. వంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ పెళ్లిళ్లు చేసుకున్నా సరైన జోడి అనుకుంటేనే ఓకే చెబుతున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పెళ్లికాని ప్రసాద్ లు ఎక్కువైపోతున్నారు. మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. దీంతో కొంతమంది అబ్బాయిలు కులం, కట్నం వంటి పట్టింపులు లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. స్థూలంగా చెప్పాలంటే పెళ్లయితే చాలు అనేటట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఆ గ్రామంలో ఇందుకు విరుద్ధంగా ఉంది. ఊరు మొత్తం అందమైన అమ్మాయిలే. కానీ, వారిని వివాహం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వారు అబ్బాయిలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రేమ, పెళ్లికి సై అంటూ సంకేతాలు ఇచ్చారు. కాకపోతే కొన్ని షరతులు విధించారు.


బ్రెజిల్ దేశంలోని నోయివా డొ కోర్డేరో అనే ఒక గ్రామం ఉంది. ఇటీవల ఆ గ్రామం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. “మా గ్రామంలో అందమైన అమ్మాయిలు ఉన్నారు. వారికోసం అంతే అందమైన పెళ్ళికొడుకులు కావాలి. నైపుణ్యం, తెలివితేటలు ఉంటే.. మా గ్రామానికి చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. ఈ ప్రేమ పెళ్లికి ఇరుపక్షాలు అంగీకరించాలి. వివాహం తర్వాత మా గ్రామంలో అబ్బాయిలు ఉండాలంటే.. కొన్ని నిబంధనలు పాటించాలంటూ” ఆ ప్రకటనలో ఆ యువతులు పేర్కొన్నారు.. అయితే ఆ ప్రకటనలో షరతులు చూసి అబ్బాయిలు భయపడుతున్నారు.

ఆ గ్రామంలో అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు కచ్చితంగా అక్కడే ఉండాలి. మూత్రశాలలు, మరుగుదొడ్లు కడగాలి. అన్ని పనులలో ఆడవాళ్లకు సాయం చేయాలి. దుస్తులు ఉతకడం, అంట్లు తోమడం, కూరగాయలు తరగడం, వంట పనిలో సహాయపడటం వంటివి చేస్తుండాలి. లింగబేదాన్ని అసలు ప్రదర్శించకూడదు. ఎటువంటి పనైనా సమానంగా చేయాలి.. అయితే ఈ నిబంధనలు చూసి కొంతమంది అబ్బాయిలు ఆ గ్రామంలో అమ్మాయిల వంక చూడటం మానేశారు. అయితే దీనిపై అక్కడి అమ్మాయిలు క్లారిటీ ఇచ్చారు. ” మేము లింగ సమానత్వాన్ని కోరుకుంటాం. మగవాళ్లకు వ్యతిరేకంగా వ్యవహరించడం మా అభిమతం కాదని” అక్కడి యువతులు చెబుతున్నారు.. మరోవైపు ఆ యువతులు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ స్థానికంగా పనులు చేసుకుంటున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తున్నారు. ఎవరి అండా లేకుండా ఎదగడమే తమ అభిమతమని పేర్కొంటున్నారు. అన్నట్టు అక్కడి అమ్మాయిలు ఇంటి పని, వంటపని, వ్యవసాయం వంటి వాటిల్లో సిద్ధహస్తులు.